వైఎస్ అనుచరుడు సూరీడుపై దాడి.. ఇంట్లోకి దూరి మరీ క్రికెట్ బ్యాట్ తో.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సూరీడుపై దాడి జరిగింది. హైదరాబాద్ లో ఇంట్లో ఉన్న సమయంలో ఆయన అల్లుడే ఇంట్లోకి క్రికెట్ బ్యాట్ తో దూరి మరీ విచక్షణ రహితంగా దాడిచేశాడు.

 • Share this:
  దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు సూరీడుపై దాడి జరిగింది. సొంత అల్లుడే మామ సూరీడుపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి దూరి మరీ దాడి చేశాడు. కొన్నాళ్లుగా అల్లుడికి, తమ కుటుంబానికి మధ్య వివాదాలు ఉన్నాయి. అల్లుడిపై గతంలో కేసు కూడా నమోదయింది. ఈ కేసు విషయంలోనే అల్లుడు ఆగ్రహించి సూరీడుపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ అనుచరుడు అయిన సూరీడు హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం సమయంలో అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. తన వెంట క్రికెట్ బ్యాట్ కూడా తెచ్చుకున్నాడు. ఇంట్లోకి రాగానే మామ సూరీడుపై విచక్షణ రహితంగా బ్యాట్ తో దాడి చేశాడు.

  కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నప్పటికీ సూరీడుపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని బయటకు నెట్టేసి సూరీడును చికిత్స నిమిత్తమై ఆసుపత్రికి తరలించారు. కాగా, గతంలో సురేంద్రనాథ్ రెడ్డిపై గృహహింస కేసు నమోదయింది. సూరీడు కుమార్తె గంగా భవానీ ప్రస్తుతం తండ్రి ఇంట్లోనే ఉంటోంది. గతంలో చేసిన ఫిర్యాదులను, కేసులను ఉపసంహరించుకోవడం లేదన్న కోపంతో సురేంద్ర నాథ్ రెడ్డి ఈ దారుణానికి యత్నించినట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఘటనపై కూడా సూరీడు కుమార్తె గంగా భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..

  ఇదిలా ఉండగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా, ఆయన వెంటే సూరీడు ఉండేవాడు. ప్రధాన అనుచరుడిగా ప్రముఖంగా వార్తల్లో కనిపించాడు. ఆయన చనిపోయిన తర్వాత క్రమక్రమంగా వైఎస్ కుటుంబానికి సూరీడు దూరమయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రాజకీయ ముఖచిత్రానికి దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఎంపీ రేవంత్ రెడ్డి నిర్వహించిన ఓ సభలో కనిపించాడు. రేవంత్ రెడ్డిలో తనకు వైఎస్ కనిపిస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు.
  ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
  Published by:Hasaan Kandula
  First published: