హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bus Fire: హైదరాబాద్‌కు వస్తుండగా ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

Bus Fire: హైదరాబాద్‌కు వస్తుండగా ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

మంటల్లో కాలిపోతున్నబస్సు

మంటల్లో కాలిపోతున్నబస్సు

Hyderabad Bus fire in karnataka: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవా నుంచి హైదరాబాద్‌కి వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సు.. అతివేగంతో అదుపుతప్పి.. టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం కాలిపోయింది.

ఇంకా చదవండి ...

    కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Karnataka Bus fire) జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన ఓ బస్సు టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత కల్వర్టును ఢీకొట్టి.. రోడ్డు దిగువకు దూసుకెళ్లింది. ఆ వెంటనే డీజిల్ లీకై.. పెద్ద ఎత్తు మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికి ఆహుతయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నలుగురు స్పాట్లోనే మరణించగా.. మరో నలుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులంతా తెలంగాణ వాసులే. గోవా నుంచి హైదరాబాద్‌ (Goa-Hyderabad bus accident) కు వస్తుండగా.. కర్నాటకలోని కలబురిగి జిల్లా కమలాపుర వద్ద (Kamalapura road accident) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో హుబ్బళ్లి-ధార్వాడ బైపాస్ రోడ్డుపై ఈ ఘోరం జరిగింది.

    నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. విద్యుత్ శాఖలో ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు కొన్ని గంటలే చాన్

    సమాచారం అందిన వెంటనే.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో 25 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

    నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. విద్యుత్ శాఖలో ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు కొన్ని గంటలే చాన్

    హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అర్జున్ తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలను గోవాలో నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను మే 29న ఓ బస్సులో గోవాకు తీసుకెళ్లారు. బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. టూర్ ముగిసిన తర్వాత గురువారం రాత్రి గోవా నుంచి వారంతా బయలుదేరారు. బస్సు కర్నాటకలోని కలబురిగి జిల్లా కమలాపుర వద్దకు చేరుకోగానే.. అదుపుతప్పింది. ఓ టెంపో వాహనాన్ని ఢీకొట్టింది.. ఆ తర్వాత కల్వర్టు ఢీకొట్టి...రోడ్డుకిందకు వెళ్లిపోయింది. అప్పటికే డీజిల్ ట్యాంక్ పగలిపోవడంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు తక్కువగా ఉన్న సమయంలో కొందరు డోర్లు, కిటికీల నుంచి దూకేశారు. మరికొందరు మాత్రం తప్పించుకోలేకపోయారు.

    మాజీ ప్రేమికుడి స్నేహితుడే ఇంత పని చేస్తాడనుకోలేదు ఆ యువతి.. ఆమెతో సాన్నిహిత్యం నటించి చివ

    చూస్తుండగానే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. కొందరు హాహాకాారాలు చేస్తూ.. మంటల్లోనే సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశాయి. బస్సులో ఇంకా కొంత మంది శవాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. మరో మూడు గంటల్లో వీరంతా హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ అంతలోనే ఘోరం జరిగింది. ఘటనా స్థలంలో సహాయ చర్యలను కలబురిగి గ్రామీణ ఎమ్మెల్యే బసవరాజ్ మతిమూడ్ పర్యవేక్షిస్తున్నారు. హుబ్లీలో ఉన్న ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bus accident, Hyderabad, Karnataka

    ఉత్తమ కథలు