హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారా ?.. ఆ కథనం వెనుక ఆంతర్యం ఏమిటి ?

ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారా ?.. ఆ కథనం వెనుక ఆంతర్యం ఏమిటి ?

Telangana: ప్రస్తుతం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేతగా కమ్మ సామాజికవర్గానికే చెందిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి రాజ్యసభలోనూ టీఆర్ఎస్ చోటు కల్పిస్తుందా ? అన్నది సందేహమే.

Telangana: ప్రస్తుతం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేతగా కమ్మ సామాజికవర్గానికే చెందిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి రాజ్యసభలోనూ టీఆర్ఎస్ చోటు కల్పిస్తుందా ? అన్నది సందేహమే.

Telangana: ప్రస్తుతం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేతగా కమ్మ సామాజికవర్గానికే చెందిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి రాజ్యసభలోనూ టీఆర్ఎస్ చోటు కల్పిస్తుందా ? అన్నది సందేహమే.

  ప్రముఖ మీడియా సంస్థ ఎన్టీవీ అధినేత నరేంద్రనాథ్ చౌదరి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారా ? ఎన్టీవీలో మంగళవారం ప్రసారమైన సుదీర్ఘ కథనం దీనికి బలం చేకూరుస్తోంది. బలమైన కమ్మ సామాజిక వర్గానికి రాజ్యసభలో ప్రాతినిథ్యం లేదని... తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగల కమ్మ సామాజికవర్గానికి అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ఈ కథనం సారాంశం. తెలంగాణ (Telangana) నుంచి కొద్ది నెలల్లోనే కొత్తగా ముగ్గురు రాజ్యసభకు వెళ్లబోతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండి ప్రకాశ్ ఎమ్మెల్సీ కావడం, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం ముగియనుండటంతో.. ఆ పార్టీ తరపున కొత్తగా ముగ్గురు రాజ్యసభకు(Rajya Sabha) నామినేట్ కాబోతున్నారు. ఈ స్థానాలకు టీఆర్ఎస్ నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే చర్చ కొన్ని నెలల ముందు నుంచే జరుగుతోంది. సామాజిక సమీకరణాలతో పాటు , కేసీఆర్‌కు(KCR) సన్నిహితంగా, నమ్మకంగా ఉండే నేతలకే పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మూడు స్థానాల కోసం పది మందికి పైగా ఆశలు పెట్టుకోవడంతో.. అసలు సీఎం కేసీఆర్ మనసులో ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ సలీం వంటి నేతలు రాజ్యసభ రేసులో ముందున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

  అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్.. ఈసారి కూడా అదే రకమైన పంథాను అనుసరిస్తారా ? అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ తరపున ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం పలు జిల్లాల్లో ఉంది. దీంతో ఈ సామాజికవర్గానికి రాజ్యసభ సీట్లలో ప్రాతినిథ్యం కల్పించే అవకాశం లేకపోలేదని వాదన వినిపిస్తోంది. ఒకవేళ సీఎం కేసీఆర్ ఆ దిశగా ఆలోచిస్తే.. నరేంద్ర చౌదరి అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.

  కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత నరేంద్ర చౌదరి ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ అనేకసార్లు పాల్గొన్నారు. దీంతో ఒకవేళ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపాలని అనుకుంటే.. నరేంద్ర చౌదరికి ఇవన్నీ సానుకూలమైన అంశాలుగా మారొచ్చని తెలుస్తోంది. అయితే నిజంగానే సీఎం కేసీఆర్ కమ్మ సామాజికవర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని అనుకుంటే.. టీఆర్ఎస్ ముఖ్యనేతగా ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రేసులో ఉండొచ్చనే టాక్ కూడా ఉంది.

  Telangana| Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. పక్కా బ్లూఫ్రింట్ రెడీ చేస్తున్న బీజేపీ

  KCR | Rahul Gandhi: కేసీఆర్ వ్యూహంలో వేలు పెడుతున్న కాంగ్రెస్.. సరికొత్త వ్యూహం ?

  అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేతగా కమ్మ సామాజికవర్గానికే చెందిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి రాజ్యసభలోనూ టీఆర్ఎస్ చోటు కల్పిస్తుందా ? అన్నది సందేహమే. అయితే రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాలు, విధేయతకు ప్రాధాన్యత కల్పిస్తూ సీఎం కేసీఆర్ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి కీలకమైన రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తారా ? లేక ఇతర అంశాలను బేరీజు వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారా ? అన్నది చూడాలి.

  First published:

  Tags: Rajya Sabha, Telangana

  ఉత్తమ కథలు