Ktr Twitter : ట్విట్టర్ ద్వార కేటిఆర్..పూర్తిగా ఎమన్నారంటే.. వాట్సాప్ నిపుణుల సూచనలను ఏమాత్రం పట్టించుకోవద్దు

మంత్రి కేటీఆర్

KTR Twitter chating : మంత్రి కేటిఆర్ కోవిడ్ నియంత్రణ సంబంధిత అంశాలపైన గురువారం సాయంత్రం ప్రజలతో ట్విట్టర్ వేదికగా సంభాషించారు. ఈ సంభాషణలో భాగంగా మంత్రి కెటియార్ పలువురు కోవిడ్ అంశానికి సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు పైన సమాధానాలిచ్చారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో జరిపిన సంభాషణ తాలూకు ప్రధాన అంశాలు....

  • Share this:
ప్రస్తుతం తెలంగాణ లాక్ డౌన్ సమర్థవంతంగా కొనసాగుతున్నదని, ప్రజల అత్యవసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఉందని తెలిపారు. కొంతమంది సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా... ప్రజల సౌకర్యార్థం ఈ నాలుగు గంటలపాటు వెసులుబాటు ఇస్తున్నామని.. దీంతోపాటు ఈ-కామర్స్ ద్వారా ప్రజల అవసరాలు తీరేలా పూర్తి వెసులుబాటు కల్పించామన్నారు ప్రస్తుతం తెలంగాణ లాక్ డౌన్ సమర్థవంతంగా కొనసాగుతున్నదని, ప్రజల అత్యవసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఉందని తెలిపారు. కొంతమంది సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా... ప్రజల సౌకర్యార్థం ఈ నాలుగు గంటలపాటు వెసులుబాటు ఇస్తున్నామని.. దీంతోపాటు ఈ-కామర్స్ ద్వారా ప్రజల అవసరాలు తీరేలా పూర్తి వెసులుబాటు కల్పించామన్నారు

ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు లాక్డౌన్ వలన కరోనా కొంత తగ్గుముఖం పడుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు మరియు రెమ్ డెసివిర్ వంటి మందుల సరఫరాను ప్రభుత్వమే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందజేయాలన్న సూచనకు స్పందించిన కేటీఆర్... ఆక్సిజన్ సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని, ఆక్సిజన్ సప్లై  విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటున్నదని అన్నారు. మరోవైపు రెమ్ డెసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తుందని, అయితే కోవిడ్ సోకిన రోగులకు కుటుంబాల నుంచి ఈ మందు వినియోగానికి తమ పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని వైద్య వర్గాలు తెలిపిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మరోవైపు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ మందుల ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న అనేక మందిని ఇప్పటికే అరెస్టు చేసిన విషయాన్ని కేటీఆర్ తెలిపారు ..ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ రోగులను దోచుకుంటున్నాయని, ఇందుకు సంబంధించి చికిత్స ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం రూపొందించాలని, చేసిన సూచనకు స్పందించిన కేటీఆర్, ఈ అంశం పైన దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఇందుకోసం ఇప్పటికే 28 వేల బృందాలను ఏర్పాటు చేసి 60 లక్షల ఇళ్లను తమ వైద్య యంత్రాంగం సందర్శించినదని, ఈ భారీ ప్రయత్నం యొక్క సానుకూల ఫలితాలు త్వరలో వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు .తమ మంత్రులంతా కూడా జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కలెక్టర్ మరియు డీఎంహెచ్ఓ స్థానిక ఆసుపత్రుల అధికారులతో ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రయత్నంలో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములు అవుతారన్నారు.

కరోనా సోకిన సందర్భంగా మానసిక మరియు శారీరక ఆరోగ్యం పైన అత్యంత ప్రభావం చూపిస్తున్నదని, ఈ విషయంలో కొవిడ్ ను ఎలా ఎదుర్కొన్నారు, కోవిడ్ వచ్చిన వారికి మీరిచ్చే టిప్స్ ఏమిటని  ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.... సొంత వైద్యం పనికిరాదని కేవలం వైద్యులు నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలన్నారు. మానసికంగా బలంగా ఉండాలని, కోవిడ్ రికవరీ తర్వాత ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేసే సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ వంటివాటికి దూరంగా ఉండాలని, ముఖ్యంగా వాట్సాప్ నిపుణుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోద్దన్నారు. వీలుంటే వ్యాయామం చేస్తే మంచిదన్నారు.

తనకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడు రోజులపాటు  తక్కువ నుంచి అతి ఎక్కువ డీగ్రీల జ్వరం కొనసాగిందని, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉన్నదని... తాను డయాబెటిక్ అయినందున బ్లడ్ షుగర్ మరియు హైపర్టెన్షన్ నియంత్రణ కొంత సవాలుగా ఉండిందని, అయితే డాక్టర్ల సరైన సూచనలు సలహాలతో అధికమించానన్నారు. ప్రస్తుతం కొంత బలహీనంగా అనిపిస్తుందని, అయినప్పటికీ సాధారణ స్థితికి చేరుకున్నానని కేటీఆర్ తన కోవిడ్ రికవరీ అనుభవాన్ని పంచుకున్నారు.

కో వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకొని వ్యాక్సిన్ అందరికీ అందేలా చూడాలని సూచన ఈ విషయంలో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు
.ఇప్పటికే వ్యాక్సిన్ కార్యక్రమంలో జాతీయ సగటు కన్నా తెలంగాణ ముందువరసలో ఉన్నదని.... ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు సైతం తెలంగాణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నదని, దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాక్సిన్ సరఫరానే అతి పెద్ద అడ్డంకి అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ లో 45 ఏళ్లకు పైబడి ఉన్న జనాభా సుమారు 92 లక్షలు ఉంటే అందులో 45 లక్షలకు పైగా ప్రజలకు మొదటి డోస్ వ్యాక్సిన్ అందిందని, మరో పది లక్షల మందికి పైగా రెండవ డోసు కూడా పూర్తయినదని అన్నారు. ఇప్పటికే మొదటి డోసు తీసుకున్న 45 లక్షల మందికి అందరికి రెండవ డోసు అందించడమే ప్రస్తుతం తమ ప్రథమ ప్రాధాన్యతగా ఉందన్నారు.
అయితే వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున, రాష్ట్రానికి కావలసిన మేరకు వ్యాక్సిన్లు అందడం లేదని కేటీఆర్ అన్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకి 9 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసే యంత్రాంగం ఉన్నదని, అయితే వ్యాక్సిన్ సరఫరాని అతి పెద్ద సవాలుగా నిలుస్తుందని అన్నారు. దీంతోపాటు వ్యాక్సిన్ తయారీదారులతోను రాష్ట్ర ప్రభుత్వం సమావేశం అవుతుందన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ల తో మాట్లాడుతున్న మన్నారు. రానున్న జూలై ఆగస్టు తొలి అర్థం నాటికి వ్యాక్సిన్లు సరఫరా తగినంత ఉండే అవకాశం ఉందని అప్పటివరకు వాక్సినేషన్ కార్యక్రమం కొంత సవాల్తో కూడుకున్నది అన్నారు.

దేశంలో తయారవుతున్న వాక్సిన్ ల లో 85 శాతం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉందని మిగిలిన 15 శాతం నుంచే రాష్ట్రాలు, ఇతర ప్రైవేటు సంస్థలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని... కొన్ని వందల మంది ఉద్యోగులుగా ఉన్న కంపెనీలకు వ్యాక్సిన్ పొందడం సులభమని... తగినంత వ్యాక్సిన్లు సరఫరా కానప్పుడు  మూడున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రానికి భారీ ఎత్తున వ్యాక్సిన్లను అందుబాటులోకి రావడం సవాలే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన గ్లోబల్ టెండర్లను కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మూడు వ్యాక్సిన్ తయారీదారులు పాల్గోనే అవకాశం, ఉందని అయితే త్వరలోనే ఫైజర్, మోడర్నా కంపెనీల వ్యాక్సిన్ లకు సైతం అనుమతి లభిస్తుందని, ఆగస్టు మాసాంతానికి దేశీయంగా బయోలాజికల్-ఈ తయారుచేస్తున్న వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాలను కొంతమంది దుష్ప్రచారం, అసత్యాలతో బద్నాం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో అయోమయానికి గురి కావద్దని, ఇవన్నీ  రాజకీయ దురుద్దేశాలతో కూడినవే అని కేటీఆర్ అన్నారు . ప్రస్తుతం ఉన్న కోవిడ్ సంక్షోభం మన రాష్ట్రంలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ జాతీయ ప్రాధాన్యతను తెలిపిందని అందరూ అనుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మాసిటీ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా మారబోతుంది అని కేటీఆర్ అన్నారు
.
ప్రస్తుతం ఉన్న సంక్షోభ కాలంలో కోవిడ్ నియంత్రణ కోసం పనిచేస్తున్న పౌరులు మరియు సంస్థల సేవలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు. వారందరికీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచం ఎప్పుడూ ఎదుర్కొని ఈ పరిస్థితుల్లో ఉన్నామని, ఇలాంటి సందర్భంలో కనీసం ఆన్లైన్ ద్వారానైనా చదువుకునే లేదా కోచింగ్ తీసుకునే విద్యార్థులు పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు .కోవిడ్ ద్వారా తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు .ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరికైనా covid symptoms ఉంటే వెంటనే మల్టీ విటమిన్లు మరియు ఇతర ప్రాథమిక మందులను తీసుకోవడం ప్రారంభించాలని, టెస్ట్ రిజల్ట్ కోసం వేచి ఉండద్దన్నారు .
Published by:yveerash yveerash
First published: