హోమ్ /వార్తలు /తెలంగాణ /

లాడ్జిలో యువతులతో వ్యభిచారం.. పక్కా స్కెచ్ తో పోలీసులు దాడి చేసి ఎంత మందిని పట్టుకున్నారంటే..

లాడ్జిలో యువతులతో వ్యభిచారం.. పక్కా స్కెచ్ తో పోలీసులు దాడి చేసి ఎంత మందిని పట్టుకున్నారంటే..

ఓ లాడ్జిలో యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమచారంతో రైడింగ్ నిర్వహించిన పోలీసులకు విటులు అడ్డంగా దొరికిపోయారు. తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో..

  మోసగాళ్ల బారిన పడి దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు యువతులు వ్యభిచార రొంపిలోకి దిగుతున్నారు. బెదిరించో, భయపెట్టో కష్టాల్లో ఉన్న యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. సినిమా ఛాన్సులు ఆశను చూపి, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి యువతులకు మాయమాటలు చెప్పి చివరకు మోసం చేసి నీచమైన పనులకు వాడుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. అదిలాబాద్ జిల్లాలో ఓ లాడ్జిలో యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమచారంతో రైడింగ్ నిర్వహించిన పోలీసులకు విటులు అడ్డంగా దొరికిపోయారు. తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో వారిని పోలీసులు పట్టుకోగలిగారు. ముగ్గురు విటులతోపాటు, వ్యభిచార నిర్వాహకులు, ముగ్గురు యువతులు, లాడ్జి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లాలోని అసీఫాబాద్ లో ఓ లాడ్జీలో కొన్నాళ్లుగా వ్యభిచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పక్కా సమాచారంతో పోలీసులు శుక్రవారం సాయంత్రం ఆ లాడ్జిలో పలు గదుల్లో దాడులు నిర్వహించారు. ఎటూ తప్పించుకునేందుకు వీలు లేకుండా పోలీసులు పక్కగా స్కెచ్ గీయడంతో ఈ వ్యభిచార ముఠాను పట్టుకోగలిగారు. లాడ్జిలోని ఒక్కో గదిని పరిశీలించి వ్యభిచారానికి పాల్పడుతున్న, వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులను పట్టుకున్నారు.

  ఇది కూడా చదవండి: పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. అసలు కారణం ఏంటని నేరుగా అతడికే వధువు ఫోన్ చేస్తే..

  వ్యభిచార ముఠాకు సహకరించినందుకు గానూ లాడ్జి యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార నిర్వాహకులు ఖాండ్రే ప్రమోద్ ను అరెస్ట్ చేశారు. వీరితోపాటు దస్నాపూర్ కు చెందిన ఆకాశ్, బూర్గుడకు చెందిన వేముల ప్రసాద్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి సంరక్షణ నిమిత్తమై జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని టాస్క్ ఫోర్స్ సీఐ వెల్లడించారు.

  ఇది కూడా చదవండి: పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..

  First published:

  Tags: Adilabad, Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు