(Katta Lenin, News 18, Adilabad)
ఒకపక్క పరీక్షల సమయం (Exams Time)… మరోపక్క వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి మొదలైన సన్నాహాలు… ఇంకా వేసవి సెలవులు… ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతోపాటు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు (Students) అవసరమైన మంచి మంచి పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి (Asifabad District Additional Collector Varun Reddy) సరికొత్త ఆలోచన చేశారు. ఆ ఆలోచనను ఆచరణలోకి కూడా పెట్టారు. నిరుద్యోగులు (Unemployed), విద్యార్థులకు మేలు చేసే ఈ ప్రయత్నాన్ని చూసిన అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ అధికారి చేసిన ప్రయోగం ఏమిటి, ఎందుకు చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు… తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇది చదవండి.
రాష్ట్ర వ్యాపంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల (Jobs) భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల్లోని నిరుద్యోగ అభ్యర్థులు (Unemployed candidates) అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదుకోలేని పరిస్థితి ఉండటంతో వారికి కొంత మేలు చేయాలన్న తలంపుతో నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలను (Books) అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రామంలోని చిన్న చెక్కపెట్ట గ్రంథాలయాన్ని (Library) ఏర్పాటు చేసి అందులో వారికి అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైన లింగా పూర్ (Lingapur) మండలం లోని పిక్లతాండ లో తొలి చెక్క పెట్టే గ్రంథాలయాన్ని (Wooden library) ఏర్పాటు చేశారు.
ఉదయం కాగానే చెట్టుకింద..
గ్రామంలోని ఓ పెద్ద చెట్టుకింద (Under Tree) ఈ పెట్టెను ఏర్పాటు చేసి, అక్కడే విద్యార్థులు కూర్చోని చదువుకునేందుకు వీలుగా అటు ఇటు బల్లలను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం గ్రామంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకులు ఈ చెట్టుకింద కూర్చోని శ్రద్దగా చదువుకుంటున్నారు. రాత్రి కాగానే ఈ పెట్టెను తీసుకువెళ్ళి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టి, తిరిగి ఉదయం కాగానే మళ్ళీ చెట్టుకింద తెచ్చి పెడుతున్నారు.
చెక్క పెట్టకు ఒక గాజు తలుపు, అందులో కొన్ని పుస్తకాలు..
ఇలాంటిదే మరో బుల్లి గ్రంథాలయాన్ని లింగాపూర్ ఎంపిడిఓ కార్యాలయంలోనూ ఏర్పాటు చేశారు. గ్రంథాలయం అనగానే ఓ పెద్ద భవనం, అందులో బీరువాల్లో రకరకాల పుస్తకాలు, కూర్చోని చదువుకోవడానికి (Reading) వీలుగా బల్లలు ఉంటాయి. కాని ఈ బుల్లి గ్రంథాలయం విచిత్రంగా ఉంటుంది. ఒక చిన్న చెక్క స్థంభంపై చెక్కపెట్టె, ఆ చెక్క పెట్టకు ఒక గాజు తలుపు. అందులో కొన్ని పుస్తకాలు. ఒంటి స్థంభం గ్రంథాలయం అన్నమాట. పోటీ పరీక్షల పుస్తకాలను (Books) నిరుద్యోగ యువతకు అందుబాటులోకీ తీసుకువచ్చేందుకు రానున్న రోజుల్లో గ్రామగ్రామాన ఇలాంటి చెక్కపెట్టె గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన పుస్తకాలను అందించేందుకు ఓ స్వచ్చంద సంస్థ కూడా ముందుకు వచ్చినట్లు సమాచారం.
ప్రతి ఒక్కరు ఇలాంటి ఆలోచన చేస్తే..
మరుమూల గ్రామాల్లోకి సైతం సోషల్ మీడియా ప్రవేశించి పుస్తకాలను తరిమేస్తున్నఈ రోజుల్లో మళ్ళీ పుస్తకం చేతబట్టి పఠనాసక్తిని పెంపొందించుకునేందుకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు ఇలాంటి ఆలోచన చేస్తే లక్షలు, కోట్లు అక్కరలేకుండానే మంచి మంచి పుస్తకాలను తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావచ్చారు. ఏదిఏమైతేనేం.. పఠనాసక్తిని పెంపొందించుకు అదనపు కలెక్టర్ చేస్తున్న ఈ ప్రయత్నం కాదు ప్రయోగం సత్ఫలితావ్వాలని ఆకాంక్షిద్దాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, JOBS, Study center