Telangana: సమస్యలను అధిగమిస్తూ.. కరోనా పోరులో మేము సైతం అంటూ..

శానిటైజేషన్ చేయిస్తున్న ఆశ కార్యకర్తలు

Telangana: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఒప్పంద పద్ధతిపై పని చేస్తున్న ఆశా కార్యకర్తలు కరోనాపై పోరాటంలో ముందుంటున్నారు. సమస్యలు అధిగమిస్తూనే కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తున్నారు.

  • Share this:
    (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

    వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఒప్పంద పద్ధతిపై పని చేస్తున్న ఆశా కార్యకర్తలు కరోనాపై పోరాటంలో ముందుంటున్నారు. సమస్యలు అధిగమిస్తూ నే కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తున్నారు. నిత్యం కంటైన్మెంట్ ప్రాంతంలో తిరుగుతూ బాధితులకు మందులు అందిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. నామమాత్రపు వేతనాలే ఇస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ ఏ పని అప్పగించిన 100% విజయవంతం చేస్తున్నారు. పలువురు కరోనా బారినపడిన దురుదృష్టవశాత్తు చనిపోతున్నారు. విధులు నిర్వహణ సందర్భంగా కొందరు కుటుంబ సభ్యులు దూరంగా కూడా ఉంటున్నారు. పాలమూరు పురపాలికలు 50 కంటైన్మెంట్ జోన్లు ఉండగా సుమారు 160 మంది పని చేస్తున్నారు. ధైర్యంగా విధులు నిర్వహిస్తూన్నప్పటికీ కుటుంబ సభ్యులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ విధినిర్వహణలో నిమగ్నం అవుతున్నారు.

    ఆశా కార్యకర్తలు వారి మనోగతం ఇలా పంచుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆశ కార్యకర్త విద్యారాణి మాట్లాడుతూ.. ఇంటర్ వరకు చదివిన నేను 11 ఏళ్ల కిందట ఆశ కార్యకర్త గా చేరానని తెలిపింది. తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కరోనా ఇంతలా వ్యాప్తి చెందుతుండటంతో ధైర్యం కూడగట్టుకొని మహబూబ్ నగర్ పట్టణంలోని కుమ్మ గిరి పీర్ల బాయ్ కంటైన్మెంట్ జోన్లలో పని చేస్తున్నాని తెలిపింది. ఆ ప్రాంతంలో 22 మంది కరోనా బాధితులున్నారు. రోజువారి ఇళ్లకు వెళ్లి వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు మందులు అందిస్తూ ఆహార నియమాలు జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నాని పేర్కొంది. ప్రస్తుతం 17 మంది ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. రాత్రి ఇంటికి వెళ్ళగానే పిల్లలను దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని అన్నారు.
    సంతృప్తినిస్తుంది..
    ప్రస్తుతం నేను మహబూబ్నగర్ పట్టణంలోని వేపూరి గిరి ఆకుల చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నా. భర్త కూలీ పని చేస్తూ ఉంటారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉంది. ప్రతిరోజు ఉదయం బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మందులు అందజేస్తాం, ఆహార నియమాలు తెలియజేస్తూ వారి బీపీ, షుగర్, ఆక్సిజన్ పరిశీలించి వివరాలు నమోదు చేస్తున్నాం. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఫీవర్ సర్వే సైతం నిర్వహించి వివరాలు అందజేశాం. ఉదయం ఏడు గంటల కు విధుల్లో చేరితే సాయంత్రం 6 వరకు కోవిడ్ పాజిటివ్ ప్రాంతాల్లో పని చేస్తున్నామని ముహబూబ్ నగర్ జిల్లా ఆశ కార్యకర్తం వేపూరిగెరి సునీత అన్నారు.
    Published by:Veera Babu
    First published: