• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • ASADUDDIN OWAISI WARNS PAKISTAN SAYS STOP MEDDLING IN KASHMIR AFFAIRS

కశ్మీర్ విషయంలో జోక్యం వద్దు...పాక్‌కు అసదుద్దీన్ హితవు

కశ్మీర్ విషయంలో జోక్యం వద్దు...పాక్‌కు అసదుద్దీన్ హితవు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కశ్మీర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని పాకిస్థాన్‌కు హితవు పలికారు.

 • Share this:
  భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ దాయాది దేశం పాకిస్థాన్‌కి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారు. కశ్మీర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టంచేశారు. కశ్మీరీలు, కశ్మీరీ యువకులు కూడా భారత్‌లో అంతర్భాగమేనని అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఇంటర్నేషనల్ యూత్ లీడర్‌షిప్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కూడా అసదుద్దీన్ విరుచుకపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా...కశ్మీర్‌లో సహజ పరిస్థితులను నెలకొల్పాలన్న సిద్ధాంతంకానీ, దార్శనికతకానీ ఆ పార్టీలకు ఉండదని విమర్శించారు. కశ్మీర్ విషయంలో ఓ సరైన విధానం అవసరమని వ్యాఖ్యానించారు.

  VIDEO: మమతా ర్యాలీకి కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదు...క్లారిటీ ఇచ్చిన ఎంపీ కవిత

  First published:

  అగ్ర కథనాలు