మూక దాడులతో అధికారం రాదు... బీజేపీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ...

Telangana : తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు అసదుద్దీన్ ఒవైసీ.

Krishna Kumar N | news18-telugu
Updated: July 6, 2019, 9:43 AM IST
మూక దాడులతో అధికారం రాదు... బీజేపీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ...
అసదుద్దీన్ ఒవైసీ (image : Facebook)
  • Share this:
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అడుగుపెడుతున్న వేళ... MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ... ఘాటైన విమర్శలు చేశారు. హైదరాబాద్ తీగల కుంటలో జరిగిన మూక దాడికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ... బీజేపీ టార్గెట్‌గా మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ యత్నిస్తోందన్న ఆయన... అది జరగదన్నారు. మోదీ రెండు గుడులు తిరిగితే... కేసీఆర్ ఆరు ఆలయాలు తిరుగుతారన్న ఆయన... కేసీఆర్‌ని గద్దె దింపలేమని తెలిసే... బీజేపీ... మూక దాడులకు కుట్రలు పన్నుతోందని ఫైర్ అయ్యారు. తాను హిందూయిజానికి వ్యతిరేకిని కానన్న అసదుద్దీన్... హిందుత్వ అజెండాకు మాత్రమే వ్యతిరేకం అన్నారు. అమిత్ షా హైదరాబాద్ వస్తున్న సమయంలో అసదుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
First published: July 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading