హోమ్ /వార్తలు /తెలంగాణ /

Asaduddin Owaisi : భారత్ కేవలం హిందువులదే కాదు... అందరిది... రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్

Asaduddin Owaisi : భారత్ కేవలం హిందువులదే కాదు... అందరిది... రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi : భారత దేశం కేవలం హిందువులది మాత్రమే కాదని అందరిదంటూ ఎమ్‌ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీ అన్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధి చేసిన వ్యాఖ్యలు ఆయన కౌంటర్ ఇచ్చారు.

నిత్యవసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేడు జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోపాల్గోని బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన హిందుత్వ విధానంపై మండిపడ్డారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు చేశాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అనుసరించే సెక్యులర్ విధానం ఇదేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ,కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుతం హిందుత్వ అనే భూమిని తయారు చేస్తున్నారని , అందులో హిందుత్వ అనే పంటను పండించేందుకు చూస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.( Asaduddin Owaisi ) హిందుత్వ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ సిద్దం అయిందని అన్నారు. కాగా భారత దేశం అనేది కేవలం హిందువుది కాదని, అందరిదని అన్నారు.

జైపూర్‌లో కాంగ్రెస్ ( Congress ) బహిరంగ సభలోపాల్గోని రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ( Rahul gandi ) హిందూ, హిందుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, హిందుత్వ వాదిని కాదని అన్నారు. భారత్ హిందువుల దేశమని, హిందుత్వవాదులది కాదని వ్యాఖ్యానించారు. గాంధీ హిందువని, గాడ్సే హిందుత్వవాది అని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపులో చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.


Bandi sanjay : బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి... టీఆర్ఎస్‌ పని అయిపోయింది...!


mim mla : నమస్తే పెట్టలేదని... ఎమ్మెల్యే కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు..


ఏడేళ్ల కాలంలో దేశాన్ని నాశనం చేశారని రాహుల్ ఆరోపించారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు అల్లాడుతున్నా.. అధికారం కోసం పాకులాడేవారే హిందుత్వ వాదులంటూ బీజేపీ నేత నేతలనుద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. మోడీ, ఆయన స్నేహితులు ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు.

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: Asaduddin Owaisi, Hyderabad, Rahul Gandhi

ఉత్తమ కథలు