హోమ్ /వార్తలు /తెలంగాణ /

Prashant Kishor విషయంలో CM KCR అనూహ్య వ్యూహం! -TRSలో చంద్రబాబు ఫార్ములా?

Prashant Kishor విషయంలో CM KCR అనూహ్య వ్యూహం! -TRSలో చంద్రబాబు ఫార్ములా?

కేసీఆర్, ప్రశాంత్ కిషోర్

కేసీఆర్, ప్రశాంత్ కిషోర్

కేసీఆర్ లాంటి నేలతో దోస్తీ మానుకోవాలని కాంగ్రెస్ సూచించిందనే వార్తల క్రమంలో.. పీకే కాంగ్రెస్ చేరినా తన ఐ-పాక్ సంస్థ ద్వారా టీఆర్ఎస్ కు సేవలు కొనసాగించే అవకాశాలు లేకపోలేవనీ తెలుస్తోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహకర్తగా పనిచేస్తోన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరనుండటం తెలంగాణలో విచిత్ర రాజకీయ వాతావరణానికి కారణమైంది. ఒకప్పుడు పీకేను దారుణంగా తిట్టిపోసిన టీపీపీసీ రేవంత్ రెడ్డి తిరిగి ఆయనతోనే కలిసి పనిచేయాల్సి రాబోతుండటం ఒక ఎత్తయితే, టీఆర్ఎస్ గెలుపు కోసం పీకే సిద్దం చేసిన ఎత్తులు అన్నిటినీ తిరిగి సమీక్షించుకోవాల్సిన స్థితి సీఎం కేసీఆర్‌ది.

2024 సార్వత్రిక ఎన్నికలతోపాటు రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ గెలుపు కోసం పీకే రూపొందిన రోడ్ మ్యాప్ ను అధినేత్రి సోనియా గాంధీ ఆమోదించి, వాటి పరిశీలనకు ఒక కమిటీని కూడా వేశారు. ఈ నెలాఖరులో జరిగే చింతన్ బైఠక్ లో వాటిపై విస్తృతంగా చర్చించనున్నారు. మే నెల తొలి వారంలో పీకే అధికారికంగా కాంగ్రెస్ లో చేరుతారని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, పీకే విషయంలో కేసీఆర్ వ్యూహం మాత్రం మరోలా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాటల్లో వెల్లడైంది. టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్, టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తదితర అంశాలపై కేటీఆర్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు..

CM KCR: మోదీని జైలుకు పంపుతారా? -గవర్నర్‌కు గులాబీ చెక్! -KTR సంచలన వ్యాఖ్యలకు అర్థమేంటి?


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ వారంలోనే నాలుగు రోజుల వ్యవధిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడుసార్లు కలిశారు. పీకే రోడ్ మ్యాప్ పై సంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ హైకమాండ్.. ఆయనను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించింది. పీకే అంటేనే ఒక బ్రాండ్.. ఆయన చేరిక బలాన్ని ఇస్తుందని సోనియాకు అత్యంత విధేయుడైన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. చింతన్ బైఠక్ ముందుగానీ, తర్వాతగానీ కాంగ్రెస్ లోకి పీకే చేరిక ఖాయంగా మారిన తరుణంలో ఆయన వ్యూహకర్తగా పనిచేస్తోన్న టీఆర్ఎస్ పార్టీ మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నది. ప్రశాంత్ కిషోర్ తన ‘వ్యూహాల’వ్యాపారాన్ని వదులుకోవాలని, కేసీఆర్ లాంటి నేలతో దోస్తీ మానుకోవాలని కాంగ్రెస్ సూచించిందనే వార్తల క్రమంలో.. పీకే కాంగ్రెస్ చేరినా తన ఐ-పాక్ సంస్థ ద్వారా టీఆర్ఎస్ కు సేవలు కొనసాగించే అవకాశాలు లేకపోలేవనీ తెలుస్తోంది.

Hyderabad: అక్షింతలు వేస్తానంటూ అంతం చేసి.. ఆలయంలోనే శవాన్ని దాచి.. మల్కాజ్‌గిరి ఘటనలో షాకింగ్ నిజాలివే


ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుబోతుండటంతో ఆయన వ్యూహాలపై ఆధారపడిన వివిధ పార్టీలు వేరే వ్యూహకర్తల కోసం వేట కొనసాగిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే, టీఆర్ఎస్ మాత్రం ఇవాళ్టికి కూడా పీకేనే తమ వ్యూహకర్తగా భావిస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ లో పీకే చేరిక వార్తలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా ఉన్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో జతకట్టబోతున్నారని, వరుస సమావేశాలు జరుపుతున్నారని మీడియాలోనే చూస్తున్నామని, అయితే చేరిక విషయంలో అసలు వాస్తవం ఏమిటన్నది ఇంకా వెల్లడికాలేదని, విషయం తెలిసిన తర్వాతే తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KCR కటీఫ్ చెబితేనే? -ప్రశాంత్ కిషోర్‌కు కాంగ్రెస్ కండిషన్? -మరోసారి సోనియాతో పీకే భేటీ


పీకే కాంగ్రెస్ లో చేరితే, అది కేసీఆర్ కల ఫెడరల్ ఫ్రంట్ కు ఆటంకంగా మారొచ్చా? అసలు కేసీఆర్ జాతీయ కూటమి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అనే ప్రశ్నలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘సీఎం కేసీఆర్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అన్ని రాష్ట్రాల సీఎంలతో సత్సంబంధాలు ఉన్నాయి. వారితో మాట్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ కూటమి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏం జరుగుతోందనేది ఆయనే వెల్లడిస్తారు’అని బదులిచ్చారు. పీకే సర్వే నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరికి షాక్ తప్పదని క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం జరుగుతుండటం, చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం సిట్టింగ్ లతోపాటు నేతలు పోటీ పడుతున్న వైనం కనిపిస్తుండగా, అది పార్టీలో అంతర్గత పోరుకు దారి తీస్తుందనే వాదనను కేటీఆర్ తోసిపుచ్చారు.

Prashant Kishor | Congress: పీకే అంటేనే ఓ బ్రాండ్.. అందుకే ప్రధాన కార్యదర్శి హోదా!


‘పార్టీలో నేతల మధ్య పోటీని అంతర్గత విభేదాలుగా ఎందుకు చూడాలి? పార్టీ బలంగా ఉందని అనుకోవచ్చుకదా. ప్రతి నియోజకవర్గంలో ఒకరికి మించి పోటీ పడుతున్నారంటే పార్టీ బలంగా ఉందనే కదా అర్థం. టీఆర్ఎస్ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. గోల్ మాల్ గుజరాత్ కావాలా? గోల్డెన్ తెలంగాణ కావాలా? అనే చర్చ నడుస్తోంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు చొప్పున ఎమ్మెల్యే అభ్యులను అధిష్టానమే ప్రోత్సహించడం అనే ఫార్ములాను గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించడం తెలిసిందే. పార్టీలో అంతర్గత విభేదాలను గెలుపు కోసం వాడుకోవడంలో దిట్టగానూ చంద్రబాబుకు పేరుండేది. నాటి చంద్రబాబు ఫార్ములానే ఇప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అనుసరిస్తోందా? అన్ని స్థానాల్లో నేతల మధ్య పోటీని హైకమాండే ఆహ్వానిస్తోందా? అనే కామెంట్లు వస్తున్నారు.

First published:

Tags: CM KCR, Congress, KTR, Minister ktr, Prashant kishor, Telangana, Trs

ఉత్తమ కథలు