K.Lenin,News18,Adilabad
మంచిర్యాల జిల్లా మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా కోటపల్లి, నీల్వాయి పోలీసులు ఆకస్మిక ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈనెల 2 నుండి 8 వరకు జరగనున్న మావోయిస్టు పార్టీ PLGA వారోత్సవాలలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలోని ఫెర్రీ పాయింట్స్, అలాగే ప్రాణహిత నది పరివాహక గ్రామాలలో.. స్పెషల్ పార్టీస్, క్యాట్ పార్టీస్, టీఎస్ఎస్పీ పోలీస్ లతో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా, వేమనపల్లి మండలంలోని రాచర్ల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంని నిర్వహించిన నీల్వాయి పోలీసులు సరైన ధ్రువ పత్రాలు లేని 21 బైకులను సీజ్ చేశారు. గ్రామంలో ఎవరైనా కొత్తవారు కనిపించినా, ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని చెప్పారు.
అలాగే, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు ముఖ్యంగా మహిళా చట్టాలు, ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్ వంటి చట్టాలపై వారికి వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, నీల్వాయి, కోటపల్లి ఎస్సైలు మరియు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Local News, Maoist, Telangana