• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • AS MAHALAKSHMI WAS BORN TO HIM AND HE DISTRIBUTED VEGETABLES ALL OVER THE VILLAGE IN SIDDIPETA DISTRICT VB

Distributed vegetables: తనకు మహాలక్ష్మి పుట్టిందంటూ.. ఊరంతా కూరగాయలను పంచిపెట్టాడు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం (Imgae credit : shutterstock)

Distributed vegetables: తనకు కూతురు పుట్టిందన్న సంతోషంలో ఆ ఊరిలో ప్రతీ ఇంటికి తిరిగి కూరగాయలను పంచిపెట్టాడు ఓ గ్రామస్తుడు. నాలుగు రోజులకు సరిపడా వివిధ రకాల కూరగాయలను అందించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.

  • Share this:
    పెళ్లైన ప్రతీ ఆలుమగలు మీకు బాబు కావాలా.. పాప కావాలా అంటే 80 శాతం మంది బాబు కావాలని కోరుకుంటారు. కానీ రాను రాను ఆ పరిస్థితులు మారిపోయాయి. ఆడపిల్లా పుట్టినా హహాలక్ష్మిలాగా చూసుకుంటున్నారు. ఆడపిల్ల పుడితే భారమని భావించే ఈ రోజుల్లో తనకు ఇంట్లో మహాలక్ష్మి జన్మించిందంటూ తండ్రి కూతురు పుట్టిన సందర్భంగా ఊరంతా కూరగాయలు పంపిణీ చేశారు. నాలుగు రోజులకు సరిపడా కూరగాయలను ప్రతీ ఇంటికి తిరుకుంటూ పంచి పెట్టాడు. కరోనా కాలంలో ఇలా చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. బిడ్డ పుట్టిందనే సంతోషం ఒకవైపు ఉంటే.. కరోనా సమయంతో ఎంతో కొంత తన వంతు సహాయం చేశానని ఎంతో ఉబ్బితబ్బైపోయాడు. ఇంతకు ఆ మహాళక్ష్మి ఎక్కడ జన్మించిందో చెప్పలేదు కదా.. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఖానాపూర్ లో మరబోయిన నవీన్‌కు శనివారం ఆడపిల్ల పుట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్‌లో తన ఇంట్లో మహాలక్ష్మి జన్మించిందంటూ తండ్రి కూతురు పుట్టిన సందర్భంలో ఊరంతా కూరగాయలను పంపిణీ చేశారు.  ఖానాపూర్ గ్రామానికి చెందిన మరబోయిన నవీన్‌కు  ఆడపిల్ల పుట్టింది. గ్రామంలోని 300 ఇండ్లకు నాలుగైదు రోజులకు సరిపడేలా ఐదు రకాల కూరగాయలు అందజేసి గ్రామస్తులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్రతీ ఒక్కరికీ తనకు కుతురు పుట్టిందని గర్వంగా చెప్పుకున్నాడు. కరోనా సమయంలో ఇలా సేవ చేసే అదృష్టం రావడం సంతోషంగా ఉందన్నారు.

    కూరగాయలు అందించేందుకు గాను నర్సింహరెడ్డి, కొమురెల్లి, శ్రీశైలం, కృష్ణమూర్తి, మల్లేశం, యాదవరెడ్డి, శివాజి యువసేన యూత్‌ మిత్ర బృందంతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు. అయితే నవీన్ చేసే పనికి ప్రతీ ఒక్కరూ మెచ్చుకున్నారు. పార్టీలు, పబ్బులని అనవసరంగా ఖర్చు చేయకుండా ఇలా ఊరి జనాలకు సాయం చేయడ వల్ల ప్రతీ ఒక్కరూ అతడిని ప్రశంసించారు.
    Published by:Veera Babu
    First published: