Home /News /telangana /

AS CM KCR ANNOUNCES EX GRATIA FOR FARMERS QUESTIONS RAISED WHAT TRS GOVT DID FOR TELANGANA MARTYRS AND LOCAL FARMERS MKS

cm kcr: ఉత్తరాది రైతులు సరే, తెలంగాణ అమరులు, రైతుల ఆత్మహత్యలకు trs సర్కార్ ఏమిచ్చింది?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

ఉత్తరాది రైతు అమరుల్ని ఆదుకుంటానన్న సీఎం కేసీఆర్.. తెలంగాణ అమరవీరులు, రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల విషయంలో భిన్నవైఖరి అవలంభిస్తుండటం విమర్శలకు తావిచ్చినట్లయింది. అమరవీరులు, రైతు ఆత్మహత్యల్ని గుర్తించడానికి కేసీఆర్ సర్కారు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. కానీ ఉత్తరాది రైతులకు మాత్రం..

ఇంకా చదవండి ...
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) పై ఉత్తరాది రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తూ చనిపోయిన 750 మంది రైతుల కుటుంబాలకు తెలంగాణ (Telangana) ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.3 లక్షలు పరిహారం ఇస్తామన్న ప్రకటన, ప్రధాని మోదీ కూడా రైతు అమరులకు రూ.25లక్షలు ఇవ్వాలన్న కేసీఆర్ డిమాండ్ జాతీయ మీడియాలో శీర్షికల్లో నిలిచింది. చనిపోయిన ఉత్తరాది రైతుల కుటుంబాలకు అండగా ఉండాలన్న కేసీఆర్ ఆలోచన అభినందనీయం. నిజానికి రైతులకు ప్రాంతీయత ఆపాదించడం సరికాకున్నా, ప్రాంతీయ ఉద్యమాల ద్వారా పెరిగిపెద్దదైన ప్రాంతీయ పార్టీకి చెందిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.

ఉత్తరాది సరే, మనోళ్ల సంగతేంటి?
ఉత్తరాది రైతు అమరుల్ని ఆదుకుంటానన్న సీఎం కేసీఆర్.. తెలంగాణ అమరవీరులు, రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల విషయంలో భిన్నవైఖరి అవలంభిస్తుండటం విమర్శలకు తావిచ్చినట్లయింది. తెలంగాణ ఉద్యమంలో ఆ మూడిటి కోసం వేల మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. కానీ చనిపోయిన అందరినీ ప్రభుత్వం అమరులుగా గుర్తించలేదు. అందుకు సవాలక్ష కొర్రీలు వేసింది. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న సుమారు 5వేల మంది రైతుల కుటుంబాలకు ఈనాటికీ పరిహారం అందలేదు. అమరవీరుల్లాగే రైతు ఆత్మహత్యల గుర్తింపులోనూ కేసీఆర్ సర్కారు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. కానీ ఉత్తరాది రైతులకు మాత్రం ఎలాంటి పరిశీలనలు లేకుండానే కోట్ల రూపాయల పరిహారం ఇస్తుండటంపై పోలికలు వస్తున్నాయి.

cm kcr అనూహ్య ఎంపిక -కవిత సహా సిట్టింగ్‌లకు షాక్ -trs mlc అభ్యర్థుల జాబితా ఇదే!


తెలంగాణ అమరులు ఎంత మంది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ దోపిడీకి గురైందని, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనవే అనే నినాదంతో సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వేలాది మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా అమరుడంటూ లేని మండలం లేదంటే అతిశయోక్తికాదు. ఉద్యమపార్టీ అయిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం దక్కుతుందని ఆశించినా, కేసీఆర్ ఆ దిశగా వెళ్లలేదు. తెలంగాణ కోసం చనిపోయిన అందరినీ అమరులుగా గుర్తించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరాకరించింది. 2009 డిసెంబరు నుంచి 2013 అక్టోబరు మధ్య తెలంగాణ కోసం 1003 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలున్నాయి. అమరవీరుల కుటుంబాల సంఘం కూడా ఏర్పడింది. నాటి ఉద్యమనేతలైన కేసీఆర్, కోదండరాంలు పరామర్శించిన కుటుంబాల ఆధారంగానే ఈ 1003 మంది నిర్ధారణ అని, వాస్తవ లెక్కల్లో ఇంకా కొద్దిమంది పేర్లు గల్లంతై ఉండొచ్చనే వాదన కూడా ఉంది. కాగా, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1003 మందికిగానూ ఇప్పటి వరకు కేవలం 698 మంది అమరుల కుటుంబాలనే ప్రభుత్వం అధికారికంగా గుర్తించి సహాయం అందించింది. మిగతా 300 మంది విషయంలో..

ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన యువతి.. ఆ తర్వాత జరిగిన డ్రామా నెవర్ బిఫోర్..అవి ఉంటేనే అమరత్వం గుర్తింపు
తెలంగాణ కోసమే ఆత్మబలిదానాలు చేసుకున్న యువకులు, వ్యక్తులు అందరినీ కేసీఆర్ ప్రభుత్వం అమరులుగా గుర్తించలేదు. పోలీస్ ఎఫ్‌ఐఆర్‌, వైద్యుల పోస్టుమార్టం రిపోర్టు, నిపుణుల ఫోరెన్సిక్‌ రిపోర్టు తదితర ఆధారాలు ఉంటేనే అమరులనే గుర్తింపు ఇస్తామని సర్కారు చెప్పడంతో అవేవీ లేకుండానే రాష్ట్ర సాధన కోసం చనిపోయినవారి కుటుంబాలు నేటికీ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి రిపోర్టుల ప్రస్తావన ఏదీ లేకుండానే సీఎం కేసీఆర్ ఉత్తరాది రైతులకు ఎకాఎకిన పరిహారం అందజేస్తున్న నేపథ్యంలో స్థానికులకు ఆయన న్యాయం చేశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రైతు ఆత్మహత్యల విషయానికొస్తే..

acid attack : ఇద్దరు పిల్లల తల్లి ప్రేమ బాగోతం -ఆ పనికి యువకుడు ఒప్పుకోలేదని..


వేల మంది రైతులవి ఆత్మహత్యలు కావా?
తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ల తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు బలవన్మరణాలకు పాల్పడే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఇంకా పైభాగంలోనే ఉంది. గడిచిన రెండేళ్లుగా రైతు బీమా పథకం అమలవుతోన్న దరిమిలా ఇన్సురెన్స్ పొందిన రైతులు చనిపోతే రూ.5లక్షల పరిహారం అందుతున్నది. కానీ తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి రైతు బీమా అమల్లోకి వచ్చిన 2018 దాకా జరిగిన ఆత్మహత్యల విషయంలో కేసీఆర్ సర్కారు కఠినవైఖరి అవలంభిస్తున్నది. 2014 జూన్‌ 2 నుంచి 2018 ఆగస్టు 14 మధ్య తెలంగాణలో 5వేల పైచిలుకు మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ వాళ్లలో కేవలం 1600 మందివే ఆత్మహత్యలుగా ప్రభుత్వం గుర్తించింది. కానీ వాళ్లలో కొందరికి ఇవాళ్టికి కూడా పరిహారం అందలేదు. ఇక మిగతా మూడున్నరవేల మందివి ఆత్మహత్యలుగా గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరిస్తున్నది..

భువనేశ్వరి ఉదంతంలో కీలక మలుపు -అసెంబ్లీ ఫుటేజ్ కోసం టీడీపీ పట్టు -చంద్రబాబుకు సోనూ సూద్ ఫోన్


రైతు కుటుంబాల గోస
ఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ రిపోర్టు, పట్టాదారు పాస్‌ బుక్‌, ఎంఎల్‌వీసీ, డీఎల్‌వీసీ నివేదిక తదితర 13 రకాల డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే రైతుల ఆత్మహత్యలను నిర్ధారిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆ విధంగా 5వేల పైచిలుకు మందిలో మూడున్నరవేల మందికి పరిహారం అందకుండా పోయింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో చాలామంది బిడ్డ పెళ్లి, కొడుకు చదువుకోసం, ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసిన వారు, తండ్రి పేరు మీద భూమి ఉన్నవారు, ఎఫ్‌ఐఆర్‌లో తప్పులుదొర్లినవారు, కౌలునామా లేని వారు 5వేల మందిలో మందిలో 3,942 మంది రైతులు ఉన్నారు. సాయం కోసం ఈ కుటుంబాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. డాక్యుమెంట్ల ఆధారంగా సాయం చేసేందుకు 1600 మందినే గుర్తించింది. అందులోనూ 250 మందికి ఈనాటికి కూడా సహాయం అందలేదు.

INS Visakhapatnam : నౌకాద‌ళంలోకి ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్నం -ప్రవేశపెట్టిన Rajnath Singh -చైనాకు వార్నింగ్


ధనిక రాష్ట్రంలో బడ్జెట్ లేదట..
250 మంది రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వానికి రూ.15 కోట్లు అవసరం కాగా, బడ్జెట్ లో డబ్బులేదని వాయిదా వేస్తుండటం గమనార్హం. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ(సోమవారం) విచారణ జరుగుతోంది. తెలంగాణలో అమరులను, రైతుల ఆత్మహత్యలను గుర్తించడానికి కఠిన నిబంధనలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం.. అటు ఉత్తరాదిలో చనిపోయిన 750 మంది రైతులకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఒకేసారి రూ.22కోట్లు అందజేసేందుకు సిద్ధమైంది. ఉత్తరాది రైతులకు పరిహారం ఇవ్వడంలో తప్పులేకున్నా, ఇంటి మనుషులను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పొలిటికల్ మైలేజీ, పబ్లిసిటీ కోసమే ఉత్తరాది రైతులకు తెలంగాణ సీఎం పరిహారం ప్రకటించారని, నిజంగా రైతులకు, అమరులను ఆదుకునే ఉద్దేశం ఆయనకు లేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Farmers, Farmers suicide, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు