ఆరోగ్య కార్యకర్తల పట్ల దురుసు ప్రవర్తన.. ఇద్దరు అన్నదముల అరెస్ట్..

కరోనా వైరస్ సమాచారాన్ని సేకరించే క్రమంలో ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం చెప్పకపోవడంతో పాటు వారిపట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.

news18-telugu
Updated: April 8, 2020, 5:30 PM IST
ఆరోగ్య కార్యకర్తల పట్ల దురుసు ప్రవర్తన.. ఇద్దరు అన్నదముల అరెస్ట్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఇటు ప్రభుత్వాలు.. అటు క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. లౌక్‌డౌన్ విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిని కొంతమంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడులకు తెగబడుతున్నారు. వైద్యులపైనా భౌతిక దాడులకు దిగుతున్నారు. దీంతో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కరోనాపై పోరు చేసేందుకు శ్రమిస్తున్న అధికారులపై దాడులకు పాల్పడినా, వారి విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆ మేరకు పోలీసు అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారు. అయితే తాజాగా అలాంటిదో మరో కేసు వెలుగులోకి వచ్చింది.

కరోనా వైరస్ సమాచారాన్ని సేకరించే క్రమంలో ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం చెప్పకపోవడంతో పాటు వారిపట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కరోనా వైరస్‌కు సంబంధించి ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని ఓ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటిలోని వారి వివరాలు సేకరించే క్రమంలో అన్నదమ్ములిద్దరూ ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం చెప్పకుండా వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో సదరు ఆరోగ్య కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్నదమ్ములిద్దరిని అరెస్టు చేశారు.
Published by: Narsimha Badhini
First published: April 8, 2020, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading