ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింపు...పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి...సాధారణ విద్యార్థిలా ఇతర విద్యార్థులతో కలిసి పరీక్షకు హాజరయ్యారు.

news18-telugu
Updated: February 11, 2019, 12:50 PM IST
ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింపు...పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఎల్ఎల్ఎం పరీక్ష రాస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
news18-telugu
Updated: February 11, 2019, 12:50 PM IST
(మహేందర్-న్యూస్18 ప్రతినిధి, నిజామాబాద్ జిల్లా)

ఇక్క‌డ ప‌రిక్ష‌రాస్తున్నాది ఏవ‌రో సాధార‌ణ విద్యార్ధి కాదు.. ఓ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే. చ‌దువుపై ఉన్న మ‌క్కువ‌తో ఆయన త‌న ఉన్నత చ‌దువును కొనసాగిస్తున్నారు. ఆయనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న గారి జీవ‌న్ రెడ్డి. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో LLM కోర్సుని దూర విద్యా విధానంలో  అభ్యసిస్తున్నారాయన. ఈ రోజు సోమవారం 3వ సెమిస్టర్ పరీక్షలు  వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో జరిగాయి. ఎమ్మెల్యే గారు స్వయంగా పరీక్షా కేంద్రానికొచ్చి ఇతర విద్యార్థులతో కలిసి పరీక్ష రాశారు.

mla jeevan reddy, armoor mla jeevan reddy, mla writing llm exams, nizamabad dist, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి, నిజామాబాద్, ఎల్ఎల్ఎం పరీక్ష
పరీక్ష రాస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


రెండు సంవత్సరాల LLM కోర్స్ లో శిక్షణ పొందుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి గత ఏడాది రెండు సెమిస్టర్ల పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. ఎమ్మెల్యే అయిన జీవ‌న్ రెడ్డికి చ‌దువు పై ఉన్న ఆసక్తితో త‌న చ‌దువును ఇంకా కొన‌సాగిస్తున్నారు. ఒక సాధారణ విద్యార్థి మాదిరిగా పరీక్షా కేంద్రానికి వచ్చి ఇతర విద్యార్థులతో కలిసి ప‌రిక్ష‌ రాయడం అందరి దృష్టిని ఆకర్షించింది.mla jeevan reddy, armoor mla jeevan reddy, mla writing llm exams, nizamabad dist, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి, నిజామాబాద్, ఎల్ఎల్ఎం పరీక్ష
ఇతర విద్యార్థులతో కలిసి సాధారణ విద్యార్థిలా పరీక్ష రాస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వరిస్తూ ప్రజలతో ఉంటూ నిత్యం బిజీగా ఉండే జీవన్‌రెడ్డి ఉన్నత విద్యను అభ్యసిస్తుండడం విశేషం. ప్రతి ఒక్కరూ జీవితంలో నిత్యవిద్యార్థిలా ఉండాలన్న సందేశమిస్తూ...అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎమ్మెల్యేగారు.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...