• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • ARE YOU RULING WITH YOUR EYES AND EARS CLOSED YS SHARMILA CRITICISMS ON CM KCR AND KTR VB

YS Sharmila: కళ్లు, చెవులు మూసుకొని పరిపాలన చేస్తున్నారా.. సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై వైఎస్ షర్మిల విమర్శలు..

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: వైఎస్ షర్మిల తన ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ కళ్లు, చెవులు మూసుకొని పాలన చేస్తున్నారని.. తండ్రీ కొడుకులకు జనం పడే కష్టాలు కనిపించడం లేదంటూ విమర్శించారు.

  • Share this:
    గత కొంత కాలంగా వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగులకు అండగా నేనున్నానంటూ దీక్ష చేపట్టిన షర్మిల.. నిరుద్యోగుల ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేశారు. వెంటనే ఖళీగా ఉన్న ఉగ్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే తాజాగా తెలంగాణలో కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెమిడేసివిర్ కోసం జనం చాంతాడంత క్యూలు కడుతున్నారని.. అయినా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోమారు విమర్శలు చేశారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, కేసీఆర్ కళ్లు, చెవులు మూసుకొని పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. చిన్న సారు కేటీఆర్‌కు కరోనా కష్టాలు అసలే కనపడవు అంటూ విమర్శించారు.




    ఒక్క రెమ్ డిసివర్ ఇంజక్షన్ రూ.3500. కానీ దానిని చాలా మంది బ్లాక్ లల్లో విక్రయిస్తున్నారు. వాటిని రూ.40 వేలకు కూడా కొంటున్నారు. ఇవి ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ఆక్సిజన్ లేక కరోనా రోగులు చస్తుంటే తనకేమీ పట్టనట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తండ్రీ కొడుకులు తమ గారడి మాటలను పక్కన పెట్టి, మౌలిక సదుపాయాలపై దృష్టి నిలపాలని షర్మిల హితవు పలికారు. రెమ్ డిసివర్ కొరత లేకుండా చూడాలన్నారు.
    Published by:Veera Babu
    First published: