ఈ సంవత్సరం బతుకమ్మ పాట ( New Bathukamma song ) ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిని మరింత ఆకర్షించనుంది. ఇప్పటికే పలు దేశాల్లో బతుకమ్మ పాటకు క్రేజ్ ఉన్న నేపథ్యంలోనే ఈ సంవత్సరం ఆ పాట మరింత ఆదరణ పొందనుంది.. ఈ పాట చిత్రీకరణ కోసం సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తుల ఆధ్వర్యంలో బతుకమ్మ పాట రూపుదిద్దుకుంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయా స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహిత ఏఆర్ రెహమాన్ (AR rahman ) సంగీత దర్శకత్వంతో పాటు ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్లు ( Gautham Vasudev Menon)కలిసి బతుకమ్మ పాటను రూపొందించారు. కాగా ఈ పాటను తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు మిట్టపల్లి సురెందర్ రాయగా ప్రముఖ గాయకుడు ఉన్నిక్రిష్ణన్ పాడారు.
ఈ బృందం రూపోందించిన బతుకమ్మ పాటను గత నెల 29, 30 వ తేదీల్లో తెలంగాణలోని యాదాద్రీ భువనగిరి (yadardi )జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామంలో షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం పాటను నాలుగు నిమిషాల నిడివిగల వీడియోతో రూపోందించారు. కాగా పాటను బతుకమ్మ పండగ రోజైన అక్టోబర్ 5న అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఆ పాట సోషల్ మీడియాలో ( social media ) వైరల్గా మారుతున్నట్టు నెటిజన్లు ప్రంశంసలు కురిపిస్తున్నారు.
ఇది చదవండి : కూతురు త్యాగం.. తల్లి ఆరోగ్యం కోసం శరీరాన్ని తాకట్టు పెట్టింది.. కాని చివరకు ..!
దీంతో బతుకమ్మ పాట కోసం ప్రముఖ దర్శకులు పనిచేయడం చాలా గర్వకారణం అంటూ పలువురు సినిమా రంగానికి చెందిన వారితోపాటు ఇతరులు సైతం ట్వీట్ చేశారు. కరోనా తర్వాత ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం బతుకమ్మ పాటకు మరింత వన్నె రానుందని పేర్కొన్నారు. మరోవైపు రెహమాన్ సంగీతం వహించిన పాటతోనే జాగృతి నేతలు బతుకమ్మ ఉత్సవాలను సెలబ్రేట్ చేసేందుకు కూడా సన్నహాలు చేస్తున్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ ఉత్సవాల్లో మరోసారి పాల్గోననున్నట్టు తెలుస్తోంది.
ఇది చదవండి : సరికొత్త రీతిలో ఏటీఎం స్కాం.. ఖాతా ఉన్న వారే దోపిడి చేశారు.. !
ప్రపంచంలో (world ) ఎక్కడా మహిళలకంటూ ఒక ప్రత్యేక పండుగ లేదు. తెలంగాణలోనే (Telangana ) ప్రత్యేకంగా మహిళలు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తొమ్మిది రోజులపాటు పూలను పూజించే గొప్ప సంస్కృతికి రాష్ట్రం వేదిక అవుతుంది. ఈ పండగ ఒక్క రోజు కాకుండా తొమ్మిది రోజుల పాటు పండుగ ముగిసేవరకు పల్లె, పట్టణం తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంటుంది. మహిళలందరు కలసి ఒక్కదగ్గర చేరి ఈ పండగను అంత్యంత వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా తొమ్మిది రోజులుగా ఆటపాటలతో పూల పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. చివరి రోజు జరిగే సద్దుల బతుకమ్మతో గౌరమ్మను సాగనంపడంతో సద్దుల బతుకమ్మకు ముగింపు పలుకుతారు. గత సంవత్సరం పండగను కరోనా కారణంగా అన్ని పండగల ఉత్సవాలను రద్దు చేసిన క్రమంలో ఈ సంవత్సరం మరింత ఉత్సహాంగా నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bathukamma, Telangana