హోమ్ /వార్తలు /తెలంగాణ /

new pension applictaions : వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం .. ధరఖాస్తుల స్వీకరణ

new pension applictaions : వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం .. ధరఖాస్తుల స్వీకరణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

new pension applictaions : కొత్త వృద్ధాప్య పెన్షన్ల కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభమైంది.. అర్హులైన వారు ఈనెల 31లోగా మీసేవ కేంద్రాల ద్వారా ధరఖాస్తు చేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

వృద్ధాప్య పెన్షన్ల కు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెలా (ఆగస్టు 31 వ తేదీ) ఖరు లోగా ఈ సేవ లేదా మీ సేవ ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం లబ్ధిదారులు దరఖాస్తులను స్వీకరించాలని, తక్షణమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్లు, ghmc కమిషనర్ లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.

ఆసరా పెన్షన్ల లో భాగంగా 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితి మేరకు లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్హులైన వారు తక్షణమే ఈసేవ, మీ సేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ghmc కమిషనర్లు ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. ఆగస్టు 31 లోగా దరఖాస్తులన్ని ప్రభుత్వానికి చేరే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఇందుకోసం పుట్టిన తేదీ ధృవీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తు తో పాటు జత చేయాల్సి ఉంటుంది. కాగా ఈ ధరఖాస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములు ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ సేవ కమిషనర్ ను అదేశించారు.

అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమని, అందుకనుగుణంగా నే అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అందులో ఆసరా పెన్షన్లు ఉన్నాయని, దేశంలో ఎక్కడలేని విధంగా పెన్షన్లు, పెన్షన్ల మొత్తం వృద్దులకు రూ. 2016/-, దివ్యాంగులకు రూ. 3016/- అందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరు ధరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

First published:

Tags: Aasara Pension Scheme, Telangana

ఉత్తమ కథలు