హైదరాబాద్‌ 'యాపిల్‌'లో కొలువుల పండగ!

యాపిల్‌లాంటి దిగ్గజ కంపెనీల్లో పనిచేయాలని చాలామంది యువతీయువకులు కలలు కంటుంటారు. మరి మీరు యాపిల్‌ సంస్థలో జాబ్ చేయాలనుకుంటున్నారా? త్వరలో 1500 మందిని నియమించనుంది యాపిల్. అది కూడా హైదరాబాద్‌లో.

news18-telugu
Updated: August 24, 2018, 4:47 PM IST
హైదరాబాద్‌ 'యాపిల్‌'లో కొలువుల పండగ!
యాపిల్‌లాంటి దిగ్గజ కంపెనీల్లో పనిచేయాలని చాలామంది యువతీయువకులు కలలు కంటుంటారు. మరి మీరు యాపిల్‌ సంస్థలో జాబ్ చేయాలనుకుంటున్నారా? త్వరలో 1500 మందిని నియమించనుంది యాపిల్. అది కూడా హైదరాబాద్‌లో.
  • Share this:
హైదరాబాద్‌లోని యాపిల్ ఫెసిలిటీ సెంటర్‌లో యాపిల్ వాచ్, మ్యాక్, ఐప్యాడ్, ఐఫోన్ లాంటి ప్రొడక్ట్స్‌కి మ్యాప్స్ డెవలప్‌మెంట్‌ పనులు జరుగుతుంటాయి. ఇప్పటికే అక్కడ 3,500 మంది పనిచేస్తున్నారు. ఆ సంఖ్యను 5000కు పెంచాలని యాపిల్ కంపెనీ భావిస్తోంది. అంటే మరో 1,500 జాబ్స్ గ్యారెంటీ అన్నమాట. ఈ విషయాన్ని ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ స్వయంగా ప్రకటించారు. ప్యాక్టెరా టెక్నాలజీస్‌కు చెందిన హైదరాబాద్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మ్యాప్స్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌తో 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయని గతంలోనే ప్రకటించింది యాపిల్ సంస్థ. త్వరలో ఆ సంఖ్య ఐదు వేలకు చేరనుందని తెలంగాణ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న హైదరాబాద్‌పై ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు కన్నేశాయి. ఇటీవలే ఐకియా ఇండియాలో తన తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించడం విశేషం. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, కాగ్నిజెంట్, అమెజాన్ లాంటి కంపెనీలున్నాయి. యాపిల్‌ కూడా తన కంపెనీని విస్తరించాలనుకోవడం విశేషం. ఇలా దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు క్యూ కడుతుండటంతో ఇక్కడి యువతకు ఉద్యోగాలకు ఢోకా లేదు. అయితే ఆ కంపెనీలకు కావాల్సిన స్కిల్స్‌ ముందే నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్‌మెంట్(టాస్క్) ద్వారా నిరుద్యోగులకు పలు కోర్సుల్ని ఆఫర్ చేస్తోంది. ఇందులో కోర్సులు చేసినవారినే యాపిల్ ఉద్యోగులుగా చేర్చుకుంది.

First published: August 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు