కేటీఆర్‌కు కొత్త తలనొప్పి... ఏపీ మంత్రులు, నేతల నుంచి వరుస ఫోన్లు...

హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో ఉన్న తమ వారికి టీఆర్ఎస్ తరఫున టికెట్లు ఇప్పించుకునేందుకు ఏపీకి చెందిన కొందరు మంత్రులు, నేతలు లాబీయింగ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: January 10, 2020, 2:54 PM IST
కేటీఆర్‌కు కొత్త తలనొప్పి... ఏపీ మంత్రులు, నేతల నుంచి వరుస ఫోన్లు...
కేటీఆర్(పేస్ బుక్ ఇమేజ్ )
  • Share this:
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. దీంతో ఆశావహుల జాబితా చాలా పెద్దగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి మున్సిపల్ ఎన్నికలు కావడంతో ఆశావహులు టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ తాకిడి చాలా ఎక్కువగా ఉంది. అయితే, సందట్లో సడేమియా అంటూ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కోసం ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కూడా టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు వస్తున్నాయి.

హైదరాబాద్ చుట్టూ కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 17 మున్సిపాల్టీలు ఏర్పడ్డాయి. ఇందులో నిజాం పేట మున్సిపల్ కార్పొరేషన్ లో మెజార్టీ ప్రజలు ఏపీకి చెందినవారు ఉన్నారు. మణికొండ, తెల్లాపూర్, అమీన్​పూర్, నార్సింగ్, పెద్ద అంబర్ పేట, బడంగ్ పేట, మీర్ పేటలో కొన్ని వార్డుల్లోనూ ఏపీకి చెందినవాళ్లే ఎక్కువ. వారిలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మొదలు పెట్టి ఆ తర్వాత నాయకులుగా ఎదిగారు. టీఆర్ఎస్ పార్టీలో చేరి అంతో ఇంతో పేరు సంపాదించుకున్నారు.

అలాంటి వారిలో తమ సామాజికవర్గం నేతలు, తమకు నమ్మిన బంట్లుగా ఉండే వారికి టికెట్ ఇప్పించుకోవడం వల్ల తమకు ఉభయతారంగా లబ్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో ఏపీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు చేస్తున్నట్టు తెలిసింది. నిజాంపేట కార్పొరేషన్​లో టీఆర్​ఎస్​ టికెట్​ కోరుతున్నవారు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద వెంట, మరో వర్గం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వెంట ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకే ఇచ్చినా.. కేటీఆర్​కు సన్నిహితుడైన శంభీపూర్ రాజు మరికొందరికి టికెట్​ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారని, డబ్బులు ఎంత ఖర్చయినా తాము పెట్టుకుంటామంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నట్టు తెలిసింది.
First published: January 10, 2020, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading