HOME »NEWS »TELANGANA »ap government buildings in hyderabad handover to the telangana governor gave the order mk

ఏపీ భవనాలు ఇకపై తెలంగాణ ఆధీనంలోకి...గవర్నర్ ఉత్తర్వులు...ఫలిస్తున్న కేసీఆర్, జగన్ స్నేహం..

ఏపీ భవనాలు ఇకపై తెలంగాణ ఆధీనంలోకి...గవర్నర్ ఉత్తర్వులు...ఫలిస్తున్న కేసీఆర్, జగన్ స్నేహం..
జగన్, నరసింహన్, కేసీఆర్ (File)

తెలంగాణ కేబినెట్ కోరిన విధంగానే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

  • Share this:
    హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలను చెరి సగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతికి తరలివెళ్లిపోయినప్పటి నుంచి, ఈ భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ భవనాలను వాడుకోనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తున్నది. ఉపయోగంలో లేకపోవడం వల్ల భవనాలు పాడవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆదివారం గవర్నర్ ను కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తిపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు.

    తెలంగాణ కేబినెట్ కోరిన విధంగానే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.



    ఇదిలా ఉంటే గడిచిన ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొలిక్కి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీలో కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు ప్రారంభించారు. అలాగే ఇఫ్తార్ విందు సందర్భంగా గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ భవనాలు తెలంగాణకు స్వాధీనం చేస్తూ పరిష్కారమార్గం వెలువడటం శుభపరిణామంగా భావిస్తున్నారు.

    గవర్నర్ ఉత్తర్వులు
    First published:June 02, 2019, 21:05 IST

    टॉप स्टोरीज