హోమ్ /వార్తలు /తెలంగాణ /

konijeti rosaiah : అంత్యక్రియలు ఆదివారమే, ఎక్కడంటే -రోశయ్య కుటుంబీకుల ప్రకటన -రాహుల్ గాంధీ రాక!

konijeti rosaiah : అంత్యక్రియలు ఆదివారమే, ఎక్కడంటే -రోశయ్య కుటుంబీకుల ప్రకటన -రాహుల్ గాంధీ రాక!

కొణిజేటి రోశయ్య పార్థివదేహం

కొణిజేటి రోశయ్య పార్థివదేహం

రోశయ్య అంతయక్రియలు ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహిస్తారా, లేక రోశయ్యకు సుదీర్ఘ అనుబంధమున్న హైదరాబాద్ లోనే నిర్వహిస్తారా? అనేదానిపై ఒకింత ఉత్కంఠ తర్వాత కుటుంబీకులు క్లారిటీ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12.30కు గాంధీ భవన్ నుంచి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.

ఇంకా చదవండి ...

తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య (89) మరణంపై యావత్ దేశం నివాళి అర్పిస్తున్నది. స్వాతంత్ర్యపోరాట యోధుడిగా, సుదీర్ఘ కాల కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసిన నేతగా, తెలుగు రాజకీయాల్లో అజాత శతృవుగా పేరుపొందిన రోశయ్య మరణంపై ప్రముఖులు, సామాన్యులు సంతాపాలు తెలుపుతున్నారు. వృద్ధాప్య సమస్యలతోకుతోడు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న రోశయ్య శనివారం ఉదయం హైదరాబాద్ లో చనిపోయారు. అకస్మాత్తుగా లో-బీపీతో ఇంట్లో పడిపోవడంతో కుటుంబీకులు ఆయనను బంజారాహిల్స్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. రోశయ్య అంతయక్రియలు ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహిస్తారా, లేక రోశయ్యకు సుదీర్ఘ అనుబంధమున్న హైదరాబాద్ లోనే నిర్వహిస్తారా? అనేదానిపై ఒకింత ఉత్కంఠ తర్వాత కుటుంబీకులు క్లారిటీ ఇచ్చారు. రోశయ్య అంత్యక్రియలపై ఆయన కుటుంబీకులు కొద్ది సేపటి కిందటే కీలక ప్రకటన చేశారు..

రోశయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం స్టార్ ఆస్పత్రిలో కన్నుమూసిన తర్వాత పార్థివదేహాన్ని అంబులెన్స్ లో అమీర్ పేటలోని ఆయన నివాసానికి తరలించారు. ప్రస్తుతం కాంగ్రెస్ తోపాటు వివిధ పార్టీల నేతలు, పలు రంగాల ప్రముఖులు అక్కడికే వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. కాగా, రోశయ్య అంత్యక్రియలు ఆదివారం నాడు నిర్వహిస్తామని, అది కూడా హైదరాబాద్ లోనే జరుపుతామని కుటుంబీకులు ప్రకటించారు.

konijeti rosaiah : వైఎస్సార్‌ను కత్తితో పొడిచి సీఎం అయ్యేవాడిని -రోశయ్య సంచలన వ్యాఖ్యలు -viral video



రోశయ్య పార్థివ దేహాన్ని రేపు(ఆదివారం) ఉదయం పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్(నాంపల్లి)కి తరలిస్తారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించిన తర్వాత మధ్యాహ్నం 12.30కు గాంధీ భవన్ నుంచి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సిటీలోని ప్రధాన మార్గం గుండా అంతిమయాత్ర జూబ్లీహిల్స్ చేరుకుంటుంది. మధ్యాహ్నం తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరుగుతాయి.

shocking : Omicron భయంతో భార్య గొంతు నులిమి, ఇద్దరు పిల్లల పుర్రెలు పగలగొట్టిన ఫొరెన్సిక్ ప్రొఫెసర్



మాజీ సీఎం, కాంగ్రెస్ కురువృద్ధుడు రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ చీఫ్ సోనియా గాందీ, రాహుల్ గాంధీతోపాటు పలు రాష్ట్రాల్లోని కీలక నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. రోశయ్య కుమారుడు శివతో ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ నేత గుర్తు చేసుకున్నారు. ఆపై కేవీపీ రామచంద్రారావుతోనూ రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. హైదరాబాద్ లో ఆదివారం జరిగే రోశయ్య అంత్యక్రియలకు రాహుల్ గాంధీ వస్తారని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు వస్తుండటం వల్లే రోశయ్య అంత్యక్రియలను ఆదివారం జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Congress, Hyderabad, Rahul Gandhi, Rosaiah

ఉత్తమ కథలు