Home /News /telangana /

konijeti rosaiah : ఒక చరిత్ర సమాప్తి -అధికార లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు

konijeti rosaiah : ఒక చరిత్ర సమాప్తి -అధికార లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు

రోశయ్య అంత్యక్రియలు పూర్తి

రోశయ్య అంత్యక్రియలు పూర్తి

మేడ్చల్ జిల్లా పరిధిలోని దేవరయాంజాల్ ఫామ్ హౌస్ లో ఆదివారం మధ్యాహ్నం తర్వాత కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛానాలతో ఈ కార్యక్రమం జరిగింది. రోశయ్యను కడసారి చూసేందుకు బంధువులు, అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఫామ్ హౌజ్ కు వచ్చారు. అశృనయనాల మధ్య హిందూ సంప్రదాయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇంకా చదవండి ...
తెలుగువారి ప్రియతమ నేత, తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. మేడ్చల్ జిల్లా పరిధిలోని దేవరయాంజాల్ ఫామ్ హౌస్ లో ఆదివారం మధ్యాహ్నం తర్వాత కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛానాలతో ఈ కార్యక్రమం జరిగింది. రోశయ్యను కడసారి చూసేందుకు బంధువులు, అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఫామ్ హౌజ్ కు వచ్చారు. అశృనయనాల మధ్య హిందూ సంప్రదాయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద కొడుకు తండ్రి చితికి నిప్పంటించడంతో అంత్యక్రియలు ముగిశాయి. రోశయ్య శనివారం ఉదయం నిద్రలోనే తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

ప్రజల సందర్శనార్థం రోశయ్య పార్థివ దేహాన్ని ఉదయం 10 గంటల నుంచి గాంధీభవన్‌లో ఉంచారు. కాంగ్రెస్ హైకమాండ్, సోనియా గాంధీ దూతగా వచ్చిన మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు రోశయ్యకు నివాళి అర్పించారు. మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభమై దేవరయాంజల్ లోని ఫామ్ హౌజ్ కు చేరుకుంది. అక్కడే అంత్యక్రియలు జరిగాయి. రోశయ్య మృతిపై తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Ghulam Nabi Azad : కాంగ్రెస్‌కు అతి భారీ షాక్! -గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ? -హైకమాండ్ పై తీవ్ర విమర్శలు



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, దాదాపు అందరు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల కేబినెట్‌లోనూ మంత్రిగా సేవలందించి.. రికార్డు సృష్టించారు రోశయ్య. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి ఏడుసార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాఠిగా పేరుపొందారు. రోశయ్య 1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1968లో తొలిసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980ల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులందరి దగ్గర కీలకమైన శాఖలు నిర్వర్తించారు. 2004లో అసెంబ్లీకి చీరాల నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

etela rajenderకు చెక్ పెడుతున్నారా? -తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటనలో అర్థం ఇదేనా?



వైఎస్సార్ అనూహ్య మరణంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగాక 2010 నవంబరు 24న తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు. కాగా, దివంగత సీఎం రోశయ్యకు హైదరాబాద్‌లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తీర్మానించింది. ఆ తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌కు పంపుతామన్నారు కాంగ్రెస్‌ నేతలు.
Published by:Madhu Kota
First published:

Tags: Congress, Hyderabad, Rosaiah

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు