నేడు కేసీఆర్, జగన్ భేటీ... ఏం చర్చిస్తారంటే...

Telangana News : ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా విభజన చట్టంలో అంశాలపై వారు చర్చించబోతున్నారు. నీటి పంపకాలు, ఆస్తుల పంపకాలపై చర్చించబోతున్నట్లు తెలిసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 10:40 AM IST
నేడు కేసీఆర్, జగన్ భేటీ... ఏం చర్చిస్తారంటే...
జగన్, కేసీఆర్ (File)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మరోసారి భేటీ కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. ఇందుకోసం ఆయన... ఉదయం 9.30కి గుంటూరులోని తాడేపల్లిలో ఉన్న ఇంటి నుంచీ బయలుదేరి... 9.50కి గన్నవర్ విమానాశ్రయాన్ని చేరతారు. 10 గంటలకు అక్కడి నుంచీ బయలుదేరి... 10.40కి హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరతారు. నెక్ట్స్ 11.40కల్లా లోటస్‌పాండ్‌లోని తన ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఇల్లు ప్రగతిభవన్‌కు వెళ్లి కలుస్తారు. చర్చల తర్వాత రాత్రికి మళ్లీ లోటస్‌పాండ్ వచ్చి... అక్కడే నిద్రపోతారు. 24న ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచీ మళ్లీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి... 11.40కి తాడేపల్లిలోని తన ఇంటికి వెళ్తారు వైఎస్ జగన్. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

ఇవీ చర్చించే అంశాలు : ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014లో కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. అలాగే 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగుల విభజన, ఇతర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై ఇద్దరు సీఎంలూ చర్చిస్తారని తెలిసింది. నదుల నీటి సద్వినియోగం, ఏపీకి రావాల్సిన కరెంటు బిల్లులపైనా చర్చ సాగుతుందని సమాచారం. ముఖ్యంగా గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించే అంశంపై ఎక్కువ సేపు చర్చిస్తారని తెలిసింది. అలాగే కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపైనా చర్చించనున్నారు. వరద నీటిని అనవసరంగా సముద్రంలోకి పంపడం కన్నా... వాటితో కరవు ప్రాంతాల్లో నీటి కష్టాలు తీర్చాలని ఇద్దరు సీఎంలు కోరుకుంటున్నారు. ఇవి కాకుండా మరిన్ని అంశాలపైనా చర్చ సాగుతుందని తెలిసింది. ఈ భేటీకి రెండు రాష్ట్రాల మంత్రులు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు కూడా హాజరు కాబోతున్నారు.

ఇవాళ చర్చించే అంశాలపై ఆల్రెడీ ఉన్నతాధికారుల స్థాయిలో ఇప్పటికే చాలాసార్లు చర్చలు సాగాయి. అన్ని అంశాలపైనా ఇప్పటికే రెండు రాష్ట్రాలూ ఏకాభిప్రాయానికి వచ్చేశాయి. అందుకే ఫైనల్‌ ఇద్దరూ సీఎంలూ కలిసి... అన్ని అంశాల్నీ ఫైనలైజ్ చేసేస్తారన్నమాట.

ఇవి కూడా చదవండి :

ఏపీ రైతులకు జగన్ షాక్... సగం మందికి రైతు భరోసా నిల్?

బతుకమ్మ చీరలకు షాక్... పంపిణీకి బ్రేక్... అడ్డుగా ఎన్నికల కోడ్
First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading