టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే ఐటీ (IT) రైడ్స్ ఉండవు. BRS అధికారంలోకి రాగానే దేశం మొత్తం ఇన్ కమ్ ట్యాక్స్ రియలైజ్ చేస్తామని మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. అప్పుడు ఎవరైనా ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఎవరికి వారే స్వచ్ఛదంగా ట్యాక్స్ చెలించేలా కేసీఆర్ కొత్త రూల్ తీస్తారని మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. సిద్ధిపేట జిల్లా ములుగు బహిలాంపూర్ లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మల్లారెడ్డి (Minister Mallareddy) ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మహాత్ముడు గొప్ప వ్యక్తి అని మల్లారెడ్డి ప్రశంసలు కురిపించాడు. అంబెడ్కర్ తర్వాత పేద ప్రజలకు మంచి చేసింది ఎవరైనా ఉంటే అది కేసీఆరే అని మల్లారెడ్డి చెప్పుకొచ్చాడు.
3 రోజుల క్రితం ఉదయం 5 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు మల్లారెడ్డి (Minister Mallareddy) ఇల్లు, కార్యాలయాలతో పాటు అతని కుమారుడు, అల్లుడు ఇళ్లలోనూ ఐటీ రైడ్స్ చేశారు. మొత్తం 50 బృందాలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో, విద్యాసంస్థల్లో, ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. మల్లారెడ్డి కుటుంబసభ్యుల ఫోన్ లను స్వాధీనం చేసుకున్న అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో భాగంగా బాలానగర్ లో క్రాంతి బ్యాంక్ లో మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు తెలియగా ఆ బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లోనూ సోదాలు జరిపారు. అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరిగాయి. రెండు రోజుల పాటు ఏకంగా 45 గంటల పాటు ఈ రైడ్స్ జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సోదాల్లో అధికారులు నగదు, బంగారం సీజ్ చేశారు. ఇక ఈ రైడ్స్ లో మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) కి ఐటీ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై ఒకరికొకరు పోలీస్ స్టేషన్ లోను ఫిర్యాదు చేసుకున్నారు. ల్యాప్ టాప్ ను మార్చారని ఐటీ అధికారి రత్నాకర్ లేదు అదే ల్యాప్ టాప్ ను స్టేషన్ లో మల్లారెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇక ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. రైడ్స్ జరిగినప్పటి నుండి మల్లారెడ్డి (Minister Mallareddy) షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Hyderabad, Mallareddy, Telangana, Telangana News