సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం. హనుమంతరావు కు బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న హనుమంత రావుకు సిద్దిపేట కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య 2536 ను మంగళవారం జారీ చేసింది. సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ (వీఆర్ఎస్) కోరుతూ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. వెంకట్రామిరెడ్డి వీఆర్ఎస్ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజాగా అతడికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖారారు చేశారు కేసీఆర్.
వెంకట్రామి రెడ్డి విషయానికి వస్తే తెరాస పార్టీ పై ఉన్న అభిమానం తో ఆ పార్టీ లో చేరబోతున్నారు. ప్రస్తుతం ఈయనకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 15న తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. బీఆర్కే భవన్‌కు వెళ్లి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ కూడా అందించారు. ఇటీవల కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కొన్ని వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఎవరైనా విత్తనాలు అమ్మితే.. ఆ పరిధిలోని అధికారులను విధుల్లో నుంచి తొలగిస్తానని కలెక్టర్ వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.
దీనిపై విపక్షాలు పలు విమర్శలు చేశారు. గతంలో సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటరామరెడ్డి సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కారం చేయడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ అయి ముఖ్యమంత్రి కాళ్లపై పడటంపై విపక్షాలు, ప్రజలు మండిపడ్డారు.
కేసీఆర్ నుంచి పిలుపు రాగానే టీఆర్ఎస్లో చేరుతానని వెంకట్రామిరెడ్డి చెప్పారు. రాజీనామా తర్వాత సెక్రటేరియట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆయన ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చడానికి కృషి చేస్తానని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన వెంకట్రామిరెడ్డి 1996లో గ్రూపు1కు సెలెక్టయ్యారు. 2007లో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. హుడా సెక్రెటరీగా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా చేశారు. దీనిలో భాగంగానే నేడు (మంగళవారం) వెంట్రామిరెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టెబట్టారు కేసీఆర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Siddipeta, Telangana Politics