ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఉద్యోగి...రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు...

ఫుడ్ లైసెన్స్ రెన్యువల్ కోసం రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

news18-telugu
Updated: February 17, 2020, 11:36 PM IST
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఉద్యోగి...రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు...
ఏసీబీ వలకు చిక్కి అవినీతి ఉద్యోగి
  • Share this:
మహబూబ్ నగర్‌లోని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నఅటెండర్ వాజిద్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి ఫుడ్ బిజినెస్‌కు సంబంధించి అనుమతులు ఇప్పిస్తానని, అందుకు రూ.4వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఫుడ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ వాజీద్… ఫుడ్ లైసెన్స్ రెన్యువల్ కోసం రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గద్వాలకు చెందిన లక్ష్మీనరసింహా డిస్ట్రిబ్యూటర్స్ యజమాని భాను ప్రకాశ్… తన షాప్ లైసెన్స్ రెన్యూవల్ కోసం అధికారికంగా చెల్లించాల్సిన రూ. 4వేలు డీడీ ద్వారా చెల్లించాడు. అయినప్పటికీ లైసెన్స్ కావాలంటే తనకు అదనంగా మరో రూ.4 వేలు ఇవ్వాలని వాజీద్ డిమాండ్ చేశాడు. దీంతో భానుప్రకాశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం వాజీద్ లంచం తీసుకుంటుండగా… ఏసీబీ సీఐ కృష్ణా గౌడ్, సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాజీద్‌ నుంచి రూ. 4 వేలు స్వాధీనం చేసుకుని… కేసు నమోదు చేశారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు