Cyber scam :ఖాయ్ రాజా ఖాయ్.... వెయ్యికి పదిహేను వేలు అంటూ ఇలా చేశారు..

Cyber scam : పవర్ పేరుతో నిండా ముంచారు.. వెయ్యికి పదివేలు అంటూ ఇలా చేశారు..

Cyber scam : నిరుద్యోగులతోపాటు సాప్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్‌గా మోసం చేసిన మరో సైబర్ నేరం వెలుగు చూసింది. కేవలం పదివేలకు రోజుకు వేయ్యి రుపాయాలు ఇస్తామంటూ వేలాది మంది నిరుద్యోగులను బురిడి కొట్టించిన సంఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.

 • Share this:
  వెయ్యికి పదిహేను వేలు
  రూ.10వేలు కడితే.. రోజుకు రూ.వేయి చొప్పున.. 150 రోజులకు రూ.1.5 లక్షలు తిరిగి చెల్లిస్తాం. అంటే.. 1.4 లక్షలు లాభమన్న మాట అంటూ ఐటీ కారిడార్‌ పరిధిలోని విద్యార్థులను నిండా ముంచేశారు. ఇలా పదుల సంఖ్యలో కాదే వేల సంఖ్యలో కుచ్చుటోపి పెట్టారు.. ఎవరికి దొరకకుండా కేవలం ఓ యాప్ ద్వార మాత్రమే దందాను కొనసాగించి బురిడి కొట్టించారు.. ముఖ్యంగా విద్యుత్ కంపనీ పేరుతో చాలా మందిని నమ్మించారు.

  15 రెట్లు ఎక్కువ ఆశ

  వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం పోలీసు స్టేషన్ ( Rayadurgam polic staion ) బాధితుడి(23) ఫిర్యాదుతో నెలరోజులుగా ‘పీవీ సోలార్‌ అప్లికేషన్స్‌’ పేరిట జరిగిన నయా మోసం తాజాగా వెలుగులోకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  గూగుల్‌ ప్లేస్టోర్‌లో ( play store ) యాప్‌..

  ‘పీవీ సోలార్‌ అప్లికేషన్స్‌’ పేరిట ఓ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. మొబైల్‌ నంబర్‌, ( mobile ) ఖాతా వివరాలుంటే చాలూ.. ఎవరైనా ఇందులో సభ్యత్వం తీసుకోవచ్ఛు ఇందులో రూ.10వేల మొదలు రూ.5 లక్షల వరకు వివిధ కేటగిరీలున్నాయి. యాప్‌ను డౌన్‌లోడ్‌ (downlode )చేసుకుని రిజిస్టర్‌ అయ్యి మన స్థోమతను బట్టి కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా డబ్బులను చెల్లించాలి. ఆ తర్వాత పెట్టుబడికి అనుగుణంగా లాభాలు ఖాతాల్లో జమ అయ్యాయి.

  ఇది చదవండి : కారు పేపర్లు చూపించమన్న కానిస్టేబుల్‌ను.. ఏకంగా కారులోనే వేసుకుని వెళ్లాడు..


  నిరుద్యోగులే టార్గెట్..

  ఇలా మొదట్లో కొన్ని రోజులు అంతా బాగానే నడిచింది. ఆ నోటా.. ఈ నోటా చాలా మంది పెట్టుబడులు పెట్టారు. వీరిలో ఎక్కువగా ఐటీ కారిడార్‌లోని ప్రైవేట్‌ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

  ఇది చదవండి : అక్టోబరు 20 రాశి ఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు.


  ఇలా బయటపడింది.

  కొన్ని రోజులుగా యాప్‌ పనిచేయడం లేదు. ఓపెన్‌ చేయగానే ఒకటి, రెండు నిమిషాల్లోనే ‘ఎర్రర్‌’ అని వచ్చి క్లోజ్‌ అవుతుండటంతో బాధితులకు అనుమానమొచ్చి ఆరా తీయగా అసలు మోసం బయటపడింది. ఎవరికీ చిక్కకుండా యాప్‌ నిర్వాహకులు చాలా తెలివిగా వ్యవహరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కంపెనీగా నమ్మించారు. ఎక్కడా కార్యాలయం పేరు, చిరునామాను పేర్కొనలేదు. ప్రత్యేకంగా కస్టమర్‌ కేర్‌ అంటూ లేదు. సందేహాలుంటే యాప్‌లో ఉండే వాట్సాప్‌ లింక్‌ను క్లిక్‌ చేసి అడిగితే నివృత్తి చేసేవారు. బ్యాంక్‌ ఖాతాల ఆధారంగా నిందితుల జాడను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు
  Published by:yveerash yveerash
  First published: