హోమ్ /వార్తలు /తెలంగాణ /

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఊహించని షాక్..సుశీ ఇన్ ఫ్రా సంస్థలో అధికారుల రైడ్స్

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఊహించని షాక్..సుశీ ఇన్ ఫ్రా సంస్థలో అధికారుల రైడ్స్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరో షాక్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరో షాక్

మునుగోడులో ఓటమి బాధ నుండి తేరుకోకముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy)కి మరో గట్టి షాక్ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థలో స్టేట్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే ప్రారంభమైన సోదాలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. అయితే సుశి ఇన్ఫ్రా వారు ఏమైనా ట్యాక్స్ లు ఎగ్గొట్టారా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు (Munugodu)లో ఓటమి బాధ నుండి తేరుకోకముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy)కి మరో గట్టి షాక్ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థలో స్టేట్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే ప్రారంభమైన సోదాలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. అయితే సుశి ఇన్ఫ్రా వారు ఏమైనా ట్యాక్స్ లు ఎగ్గొట్టారా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుశీ ఇన్ఫ్రా మైనింగ్ రంగంలో ఉంది. బొగ్గు గనుల తవ్వకాల్లో ఆ సంస్థకు కొంతమేర పట్టు ఉంది. ఈ సంస్థ సింగరేణికి చెందిన ఓపెన్ కాస్ట్ గనుల్లో మైనింగ్ చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ లు ఏమైనా ఎగ్గొట్టారని వచ్చిన ఫిర్యాదుల మేరకు స్టేట్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం అందుతుంది.

Viral News: కళ్లలో రాళ్లు, బియ్యం .. 11ఏళ్ల బాలిక పడుతున్న ఇబ్బంది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది

మునుగోడు ఉపఎన్నిక సమయంలో కూడా..

మునుగోడు బైపోల్ (Munugodu Bypoll) సమయంలో సుశి ఇన్ఫ్రా కంపెనీ హాట్ టాపిక్ గా మారింది. ఈ కంపెనీ నుండి మునుగోడులోని పలువురికి రూ.5.2 కోట్లను బదిలీ చేశారు. అక్టోబర్ 14, 18, 29 తేదీల్లో బదిలీ జరిగిందని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సుశి ఇన్ఫ్రా అండ్ డెవలప్ మెంట్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా నుండి 23 మందికి నగదు బదిలీ జరిగినట్లు ఫిర్యాదులో తెలిపింది.  ఈ బదిలీని కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారా జరిగితే 23 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక నగదు బదిలీ ఆరోపణలపై ఈసీకి (Election Commission) సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. దీనిపై రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) స్పందిస్తూ..సుశి ఇన్ఫ్రా అకౌంట్ నుంచి బదిలీ అయిన నగదు బదిలీకి తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కు వివరణ కూడా ఇచ్చామన్నారు.

ఇక మునుగోడు బైపోల్ లో బీజేపీ అభ్యర్థిగా నిలబడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) ఓటమి పాలయ్యారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (kusukuntla Prabhakar reddy) 10 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి (Palwai Sravanthi) నిలబడగా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.

First published:

Tags: Bjp, Congress, Komatireddy rajagopal reddy, Trs

ఉత్తమ కథలు