తెలంగాణలో ఆగని మరణ మృదంగం.. మరో బాలికను బలితీసుకున్న డెంగ్యూ..

తెలంగాణలో  డెంగ్యూ కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే వందల సంఖ్యలో రోగులు హాస్పటల్‌లో మృత్యువాత పడుతున్నారు. తాజాగా మెదక్ పట్టణానికి చెందిన నాయిని కావ్య (15) డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 31, 2019, 12:10 PM IST
తెలంగాణలో ఆగని మరణ మృదంగం.. మరో బాలికను బలితీసుకున్న డెంగ్యూ..
డెంగ్యూ కారణంగా మృతి చెందిన కావ్య (15)
  • Share this:
తెలంగాణలో  డెంగ్యూ కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే వందల సంఖ్యలో రోగులు హాస్పటల్‌లో మృత్యువాత పడుతున్నారు. తాజాగా మెదక్ పట్టణానికి చెందిన నాయిని కావ్య (15) డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. పట్టణానికి చెందిన అశోక్, స్వప్న కుమార్తె అయిన కవిత..స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. నిన్న ఉదయం కావ్యకు జ్వరం వచ్చిందని పాఠశాల నుంచి తల్లితండ్రులకు ఫోన్ చేసారు. హుటాహుటిన పాఠశాలకు వెళ్లిన తల్లితండ్రలు ఆమెను చికిత్స నిమిత్తం ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి రావడంతోనే  కావ్య రక్తపు వాంతులు చేసుకొంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పరిస్థితి విషయమించడంతో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌లో కొనఊపిరితో ఉన్న కావ్యను బతికేంచుందకు వైద్యులు పడ్డ శ్రమ వృథా అయింది.  మృతి చెందిన కావ్య పార్థివ దేహాన్ని స్వస్థలమైన మెదక్‌కు తరలించారు. పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే కావ్య మృతి చెందినట్టు ఆరోపిస్తూ.. తల్లిదండ్రులు బంధువులు పాఠశాల ముందు మృత దేహంతో బైటాయించారు. స్కూల్ ప్రిన్సిపల్, వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారాకో నిర్వహించారు. కావ్య మృతికి సంతాపంగా మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్చందంగా మూసివేసారు. అప్పటి వరకు ఎంతో చలాకీగా ఆరోగ్యంగా ఉండే కావ్య మృతితో మెదక్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్కూలు యాజమాన్యం మాత్రం కావ్యకు జలుబు అయితే మందులు వేసామని చెప్పారు. ఇంతలోనే ఆమె మరణించడం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు.


First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>