బిగ్‌బాస్ షోకు నన్ను సెలక్ట్ చేయలేదు.. పోలీసులకు గాయత్రీ గుప్తా ఫిర్యాదు

గాయత్రి గుప్తా (Image : Instagram)

బిగ్‌బాస్ షోకి తాను సెలక్టయ్యానని చెప్పి ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారన్నారు. తీరా, ఒక రోజు ఫోన్ చేసి సెలక్ట్ కాలేదని చెప్పారని ఆ నటి ఆరోపించింది.

  • Share this:
    మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ‘బిగ్ బాస్’ షో వివాదంలో చిక్కుకుంటోంది. షో నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాజాగా  మరో నటి ఇదే షోపై పోలీసులను ఆశ్రయించారు. టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ షోపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్ షోకి తాను సెలక్టయ్యానని చెప్పి ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారన్నారు. తీరా, ఒక రోజు ఫోన్ చేసి సెలక్ట్ కాలేదని చెప్పారని ఆరోపించింది. ఇప్పుడు తాను షోకు సెలక్ట్ కాకపోవడంతో ఆరు సినిమాల్లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని తెలిపింది గాయత్రి గుప్తా.

    అభిషేక్, రఘు, రవికాంత్‌ అనే ముగ్గురు వ్యక్తులు ముంబై నుంచి తన ఇంటికి వచ్చి బిగ్ బాస్ షో అగ్రిమెంట్ చేయించుకున్నారని తెలిపింది. బిగ్‌బాస్‌ షోకి రావడానికి సిద్ధమేనా అని రఘు అడిగాడన్నారు. వంద రోజులపాటు హౌస్‌లోనే ఉండాల్సి వస్తుందని అన్నారని గాయత్రి గుప్తా తెలిపింది. తాను సరేననడంతో వేరే ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని పేర్కొంది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే పైవారిని ఎలా సంతృప్తి పరుస్తారని రఘు అనే వ్యక్తి తనను అడిగాడని గాయత్రీ గుప్త ఆరోపించింది. దీంతో అలా ఎందుకని తాను ఘాటుగా ప్రశ్నించానని గాయత్రి తెలిపింది.

    ఆ తర్వాత ఒకరోజుల తనకు ఫోన్ చేసి బిగ్ బాస్ షోకు తాను సెలక్ట్ కాలేదన్నారు. దీంతో తన చేతిలో ఉన్న ఆరు సినిమాలు వదిలేసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఈ మేరకు బిగ్ బాస్ షో నిర్వాహకులపై ఆమె కేసు వేశారు. తనకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు గాయత్రీ గుప్తా.
    First published: