ANOTHER BY ELECTION CHANCE IN TELANGANA MP ARVIND PRESS MEET IN DELHI EVK
Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నిక : ధర్మపురి అరవింద్
ఎంపీ అరవింద్ (ఫైల్)
Telangana: ఇటీవలే తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిశాయి. ఇంతో మరో ఉప ఎన్నిక రానుందా? ఈ అంశంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలే తెలంగాణ (Telangana)లో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిశాయి. ఇంతో మరో ఉప ఎన్నిక రానుందా? ఈ అంశంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో వేములవాడ ఉప ఎన్నిక రావొచ్చని, అక్ డ కూడా భాజపా విజయం ఖాయమని ధర్మపురి అరవింద్ విశ్వాసం వ్య క్తం చేశారు. ఢిల్లీ (Delhi)లో ఆయన మంగళవారం మిడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. ముఖ్య మం త్రి కేసీఆర్ (KCR) వైఫల్యం వల్ల తెలం గాణలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైం దని, మార్క్‌ఫెడ్ సం స్థను నిర్వీ ర్యం చేశారని ఆరోపిం చారు. గతంలో తక్కు వ ధాన్యం కొనుగోలు చేసి రిజిస్ట్రర్లలో ఎక్కు వ సేకరిం చినట్టు నమోదు చేసేవారని, దీనికి అడ్డుకట్ట వేసేం దుకు కేంద్ర ప్రభుత్వం సేకరణ ప్రక్రియను కం ప్యూ టరీకరణ చేసిం దని గుర్తు చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని, అది ఏ క్షణం లోనైనా వెలుగులోకి రావొచ్చ ని రావొచ్చని ఆయన అన్నారు.
రాబోయే రోజుల్లో కేంద్రం వరి కోనుగోలు చేయకపోవడంపై నిరసనలు తెలుపుతూనే ఉండాలని భావిస్తున్న టీఆర్ఎస్.. దీనిపై ఢిల్లీలోనూ నిరసన కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
నవంబర్ 29న దీక్షా దీవస్ రోజే ఢిల్లీలో ఇందుకు సంబంధించి దీక్ష చేపట్టాలని.. ఈ దీక్షలో స్వయంగా సీఎం కేసీఆర్ పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజే వరంగల్‌లో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసిన భారీ బహిరంగ సభను రద్దు చేసుకుని.. ఢిల్లీలో ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది.
బండి సంజయ్ యాత్రతో ఉద్రిక్తత..
వరిధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన జరిగిన చోట టీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో నిరసనలు.. పలు చోట్ల ఇరు వర్గాల మధ్య దాడులు జరుగుతు ఉద్రిక్తి వాతావరణం నెలకొంది. నల్గొండ రూరల్(nalgonda) మండలంలోని అర్జాలబావి ఐకేపీ సెంటర్‌ను బండి సంజయ్ కాన్వాయిపై దాడితో బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. దాడుల వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని వారు ఆరోపిస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.