యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు ఖతాల్లో జమా అవుతుండటంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి జమ చేస్తున్నందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఇక ఆ పాలాభిషేకం కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలం పుస్పూర్ర్ గ్రామంలో రైతులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీయం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఉండేదిని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Nalgonada : ముందుగా ప్రభుత్వ ఉద్యోగి.. ఆ తర్వాత 6గురు స్నేహితులు.. యువతిపై లైంగిక దాడి.
ఫలితంగా..!
కాగా నిన్న నుండి ఎనిమిదవ విడత రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ సీజన్లో 66.61 లక్షల రైతులకు గాన,152 లక్షల ఎకరాలకు రైతుబంధు అందనుంది. మొత్తంగా ఇందుకోసం 7645 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. ముందుగా ఎకరం లోపు ఉన్న రైతులకు వారి ఖాతాల్లో జమ చేస్తుండగా పది రోజుల పాటు నిధుల పంపిణి కార్యక్రమం కొనసాగనుంది. మొత్తం ఎనిమిది విడతల్లో 50వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు చేర్చారు. కాగా ఇటివల ఈ నిధుల కోసం 3500 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, CM KCR, Rythubandhu