హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎంపీ కవిత ఆహ్వానం...హైదరాబాద్ రానున్న అన్నా హజారే

ఎంపీ కవిత ఆహ్వానం...హైదరాబాద్ రానున్న అన్నా హజారే

 అన్నా హజారే

అన్నా హజారే

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు సామాజిక కార్యకర్త అన్నా హజారే హాజరుకానున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఇచ్చిన ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొననున్నారు.

    ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధీయేవాది అన్నాహజారే హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఇచ్చిన ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొననున్నారు. శనివారం రోజున హైదరాబాద్‌లోని నోవా టెల్ హోటల్‌లో జరిగే అన్నా హజారే సదస్సుకు హాజరవుతారు. ఈ నెల 20న సాయంత్రం జరిగే ముగింపు సదస్సుకు గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఎంపీ కవిత సదస్సుకు ఆహ్వానించారు. ఈ సదస్సులో భాగంగా యువజన ప్రగతి, ప్రపంచ ప్రగతిలో యువజనుల పాత్రపై యువ నాయకులు మాట్లాడనున్నారు.


    గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు అంశంపై ఈ సదస్సులో చర్చిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. 2030 వరకు భావి మానవాళి మనుగడకు అవసరమైన ప్రాథమిక లక్ష్యాలను సాధించేందుకు ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన 17 అంశాల లక్ష్యాల సాధనలో భాగంగా తెలంగాణ జాగృతి ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నదని ఆమె వివరించారు. 103 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారని తెలిపారు. 16 దేశాల నుంచి 70 మంది వక్తలు, 40 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని ఎంపి కవిత చెప్పారు.

    First published:

    Tags: Anna Hazare, MP Kavitha

    ఉత్తమ కథలు