ANMS DEMANDING FOR PROTECTION FROM THE PUBLIC TO GIVE CORONA VACCINE NZB VRY
Nizamabad : రక్షణ లేనిదే... వ్యాక్సిన్ వేయలేంటున్న ఏఎన్ఎంలు.. నిజామాబాద్ ఘటనపై ఆందోళన
Nizamabad : రక్షణ లేనిదే... వ్యాక్సిన్ వేయలేంటున్న ఏఎన్ఎంలు..
Nizamabad : నిజామాబాద్ జిల్లాలో నిన్న గర్భిణికి వ్యాక్సిన్ వేసిన ఓ ఏఎన్ఎం పై దాడి జరగడంతో వారికి
ప్రభుత్వం నుండి రక్షణ కల్పించాలని జిల్లాలో ఆందోళన బాట పట్టారు. భవిష్యత్లో ఇలాంటీ సంఘటనలు
జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు..
18 సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరికి కరోనా టీక వేయాలని ప్రభుత్వం అదేశించింది.. దీంతో వ్యాక్సినేషన్ టార్గెట్ ఏఎన్ఎంలు పై పడింది.. గడువు లోగా 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులు నిర్ధేశించారు.. దీంతో అధికారులు పెట్టిన లక్ష్యయాన్ని త్వరగా పూర్తి చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.. వ్యాక్సిన్ తీసుకునేందుకు కొందరు ముందుకు రావడం లేదు.. మరి కొన్ని చోట్ల కరోనా టీకా వేయడానికి వెళ్లిన సిబ్బంది పై దాడులు చేస్తున్నారు.. తాజాగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా టీకా ఇచ్చిన ఏఎన్ఎం పై దాడి చేసిన ఘటన సంచలనం రేపింది.. దీంతో ఇంటికి తిరిగి వ్యాక్సినేషన్ వేసేందుకు ఏఎన్ఎంలు జంకుతున్నారు.. మాకు రక్షణ కల్పించాలని పై అధికారులును వేడుకుంటున్నారు..
ప్రతి ఏఎన్ఎం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు వంద మందికి పైగా టీకా వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.. అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏఎన్ఎంలు వారి లక్ష్యం పూర్తి చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు.. నిజామాబాద్ లోని అర్సపల్లి.. సీతారాం నగర్ కాలనీ.. చంద్రశేఖర్ కాలనీ.. గౌతంనగర్.. దుబ్బా.. ఆర్మూర్ పట్టణ ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల ప్రజలు ముందుకు రావడం లేదు.. దీంతో వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తే.. వాగ్వాదానికి దిగుతున్నారు.. నగరంలోని మాలపల్లి.. అర్సపల్లి ప్రాంతాల్లో సిబ్బందిపై పలుమార్లు దాడులు చేయడానికి యత్నించారు.. బోధన్ సీతారాం నగర్ కాలనీ ప్రాంతంలో అతి తక్కువ గా వ్యాక్సినేషన్ తీసుకున్నారు.. వారికి టీకా ఇచ్చేందుకు వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినా స్థానికులు సహకారం అందించడం లేదని ఏఎన్ఎంలు వాపోతున్నారు.
ఈ క్రమంలోనే నిన్న జరిగిన సంఘటనకు నిరసనగా ఏఎన్ఎంలు అందరు కలిసి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ద్ద ఆందోళనకు దిగారు.. మాకు రక్షణ కావాలని కలెక్టర్ ఏకరావు పెట్టుకున్నారు.. ఇలాంటి ఘటనలు పునఃరవృతం కాకుండా కటిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు..
ఈ సంధర్భంగా.. టార్గేట్ పెట్టవద్దని వేడుకున్నారు.. మేము ఇంటికి వెల్లి వ్యాక్సిన్ ఇవ్వలేమని చెప్పారు.. ఒకే చోట ఉంటామని.. వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామాని చెప్పారు... అధికారులు చెప్పిన టార్గేట్ పూర్తి చేసేందుకు మేము పడుతున్న కష్టం ఎవరికి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.. వారు ఒంటరిగా టీకా వేయాడానికి వెళ్లడంతో మాకు రక్షణ లేదు.. వారితో పాటు ఓ కానిస్టేబుల్ను ఇవ్వాలని కోరారు.. ఇలాంటి ఘటనలు మల్లి జరుగాకుండా కఠిన చర్యలు తీసుకోవాని కోరారు..
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.