Home /News /telangana /

ANM WORKER HAS BEEN BEATEN UP AFTER GIVING CORONA VACCINE TO PREGNANT WOMAN VRY

corona vaccine : కరోనా టీకాతో ముందే కాన్పు.. శిశువు మరణించిందని ఏఎన్‌ఎంను చితకబాదిన కుటుంబ సభ్యులు..!

ఏఎన్ఎం

ఏఎన్ఎం

corona vaccine : గర్భిణి మహిళలకు కరోనా టీకా వేయడం వల్లే ఆమెకు పుట్టిన శిశువు పురిటిలోనే చనిపోయిందంటూ టీకా వేయించిన ఏఎన్‌ఎంపై దాడికి దిగారు. అయితే ఆ గర్భిణికి మొదటి కాన్పులో కూడా శిశువు చనిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు.

    కరోనా టీకాలపై ఇంకా అనుమానాలు అపోహలు ప్రజల్లో ఇంకా నెలకొన్ని ఉన్నాయా... టీకా వేసుకునేందుకు అనే మార్గదర్శకాలు ప్రభుత్వం తీసుకువచ్చినా.. ముందుకు రాకపోవడంతో పాటు టీకా వేసుకునేందుకు అనేక మంది వెనకడుగు వేస్తున్నారు. దీంతో ప్రతి ఇంటికి వెళ్లడంతో పాటు ప్రజలు పని చేసే చోటుకు కూడా వెళ్లి వారికి అవగాహన కల్పించి బలవంతంగానైనా టీకాలు వేస్తున్నారు. ఇలా ఓ గర్భిణికి కరోనా టీకా ఇవ్వడంతో ఆమెకు ప్రసవసమయానికి ముందే శిశువు జన్మించి మృతి చెందిదని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తూ ఏకంగా టీకా ఇప్పించిన ఏఎన్‌ఎంను చితకబాదిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

    గర్భిణికి కరోనా టీకా వేయడం తోనే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఏఎన్ఎం పై దాడి చేశారు.. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చోటు చేసుకుంది.
    బాధితురాలు తెలిపిన వివరాలు ఇలావున్నాయి..

    ఇది చదవండి : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి కౌంటర్ అటాక్.. ఎయిమ్స్‌పై వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్.. !


    కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామానికి కి చెందిన గర్భిణి వడ్డే శ్రీలతకు.. ఈనెల ఒకటో తేదీన కోవి షీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసును స్థానిక ఆశా వర్కర్‌లు ఇప్పించారు. అయితే టీకా వేయించుకున్న మరునాడే అనగా ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో గాంధారి సామాజిక ఆరోగ్య కేంద్రనికి తరలించగా అక్కడ ప్రసవం జరిగింది.. అయితే తక్కువ బరువుతో ఉన్న ఆడ శిశువు జన్మించింది. దీంతో తక్కువ బరువుతో పుట్టిన శిశువును కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమించడంతో అక్కడినుండి హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.. కాగా చికిత్స పొందుతూ ఈనెల 4వ తేదీన శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు..

    అయితే శ్రీలత తన బిడ్డ మృతికి అసలు కారణాలు పట్టించుకోకుండా.. తాను ప్రసవానికి ఒకరోజు ముందుగానే వేయించుకోన్న టీకాపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. టీకా వల్లే తనకు పుట్టిన శిశువు మృతి చెందిందని భావించారు.. టీకా వికటించడంతోనే ఇలా జరిగిందని ఆమెకు టీకా వేయించిన ఏఎన్‌ఎంను ఫోనో‌లో తిడుతూ టార్చర్ పెట్టారు. అయినా భరించిన ఏఎన్‌ఎం నేడు తనవిధులకు హజరైంది. దీంతో గాంధారీ ఎక్స్ రోడ్‌లో ఆమెను అడ్డగించిన శ్రీలత తల్లి ఆమెపై దాడి చేసింది.  దీంతో దాడికి గురైన  ఏఎన్ఎం  ఆవేదన వ్యక్తం చేశారు.. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు... అయితే శ్రీలతకు మొదటి కాన్పులో కూడా బిడ్డ పుట్టి చనిపోయినట్టు ఆమె చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే జరిగిందని వివరించారు.

    అయితే ఇదంతా కరోనా టీకా మీద అపోహలు ఉండడం వల్లే సంఘటన జరిగినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కాగా గర్భిణిలు కూడా కరోనా టీకా వేయించుకోవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇంకా గర్భిణి మహిళల్లో అవగాహాన లేకపోవడం మరిన్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు గర్భిణిలకు టీకాపై సరైన అవగాహాన కల్పించాలని కోరుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Corona Vaccine, Kamareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు