న్యూఇయర్ గిఫ్ట్...నేటి నుంచి ఏపీలో రూ.15కే కిలో ఉల్లి...

రైతుల నుంచి సేకరించిన ఉల్లిని రాష్ట్రంలోని 101 రైతు బజార్లలో జనవరి 1 నుంచి కిలో రూ.15కే పంపిణీ చేయనుంది.

news18-telugu
Updated: January 1, 2020, 7:06 AM IST
న్యూఇయర్ గిఫ్ట్...నేటి నుంచి ఏపీలో రూ.15కే కిలో ఉల్లి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉల్లి ధరలు సామాన్యులకు ఇంకా అందుబాటులోకి  తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం కిలో ఉల్లి రూ.15కే ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రైతుల నుంచి సేకరించిన ఉల్లి పాయలను రాష్ట్రంలోని 101 రైతు బజార్లలో జనవరి 1 నుంచి కిలో రూ.15కే పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులక కిలో ఉల్లికి రూ.50 నుంచి రూ.60 చెల్లించి, రోజుకు 50-60 టన్నుల దాకా మార్కెటింగ్‌ శాఖ తెప్పిస్తోంది. వీటిని కిలో రూ.15కే సబ్సిడీ ద్వారా వినియోగదారులకు అందిస్తామని సివిల్ సప్లయ్స్ అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 130 రైతుబజార్లు ఉండగా, 101 పెద్ద యార్డుల్లోనే రాయితీ ఉల్లిని పంపిణీ చేయనున్నారు. ఈజిప్టు, టర్కీ నుంచి కేంద్రం దిగుమతి చేసుకునే ఉల్లి రాష్ట్రానికి వస్తే కిలో రూ.25 చొప్పునే సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: January 1, 2020, 6:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading