హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | KTR : కేటీఆర్ సీఎం కావాల‌ని ఆంధ్రా యువ‌కుడి పాద‌యాత్ర‌.. దసరాకు కేసీఆర్ నిర్ణయం?

CM KCR | KTR : కేటీఆర్ సీఎం కావాల‌ని ఆంధ్రా యువ‌కుడి పాద‌యాత్ర‌.. దసరాకు కేసీఆర్ నిర్ణయం?

కేటీఆర్ సీఎం కావాలని పాదయాత్ర

కేటీఆర్ సీఎం కావాలని పాదయాత్ర

కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టనుండటంతో రాష్ట్రంలో పాలనా పగ్గాలు కొడుకు కేటీఆర్ కు ఇస్తారనే చర్చ మళ్లీ మొదలైంది. సరిగ్గా ఈ సమయంలోనే కేటీఆర్ సీఎం కావాలంటూ ఆంధ్రా యువకుడు పాదయాత్ర చేస్తున్నాడు. వివరాలివే..

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన దరిమిలా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి చర్చలు జోరందుకున్నాయి. కేసీఆర్ కొడుకు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన మంత్రి కేటీఆర్ ను సీఎం చేయాలని సహచర మంత్రులు, పదులకొద్దీ ఎమ్మెల్యేలు చాలా కాలంగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. బహిరంగ వేదికలు, మీడియా సమావేశాల్లో కేటీఆర్ ను సీఎం అని సంబోధిస్తూ గులాబీ నేతలు గతేడాదంతా సందడి చేశారు.

అయితే, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ దెబ్బలు తగిలాక సదరు డిమాండ్ చల్లబడింది. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత అధికార పార్టీనేతలెవరూ సీఎం మార్పుపై నోరెత్తలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టనుండటంతో రాష్ట్రంలో పాలనా పగ్గాలు కొడుకు కేటీఆర్ కు ఇస్తారనే చర్చ మళ్లీ మొదలైంది. సరిగ్గా ఈ సమయంలోనే కేటీఆర్ సీఎం కావాలంటూ ఆంధ్రాకు చెందిన యువకుడు పాదయాత్ర చేస్తుండటం గమనార్హం. వివరాలివే..

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు.. 31న మోదీ స్వయంగా..


త‌న‌ది ప‌క్క రాష్ట్ర‌మైనా తెలంగాణ‌లో మంత్రిగా కేటీఆర్ చేస్తున్న ప‌నులకు అత‌డు ఫిదా అయ్యాడు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ న‌డిపిస్తున్న తీరుకు ముగ్ధుడ‌య్యాడు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల‌ని ఆకాంక్షించాడు. ఇందుకోసం విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు పాద‌యాత్ర ప్రారంభించాడు ఆంధ్రాకు చెందిన శేఖ‌ర్‌.

కేటీఆర్ సీఎం కావాలని పాదయాత్ర చేస్తోన్న ఏపీ యువకుడు శేఖర్

CM KCR | Vehicle Tax : అప్పులు దొరక్క పన్నులు బాదుడు! -వాహనాలపై టాక్స్ భారీగా పెంచిన కేసీఆర్ సర్కార్


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా రాజం మండలానికి చెందిన శేఖర్ మంత్రి కేటీఆర్‌కు అభిమాని. కేటీఆర్ పేరును త‌న చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. మంత్రి కేటీఆర్ సీఎం కావాలని విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్టాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకుపోతున్న విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని శేఖ‌ర్‌ అంటున్నాడు. తెలంగాణ‌ను అభివృద్ధిలో ప‌రుగులుపెట్టిస్తున్న‌ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఇత‌ర రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నాడు. కేటీఆర్ సీఎం కావాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నానని చెప్పాడు. మరోవైపు,

Tragedy : ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అందులో ఇద్దరు నిండు గర్భిణులు.. పిల్లలతోకలిసి బావిలో శవాలుగా..


దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనాలు చూడబోతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న వేళ మంత్రి మల్లారెడ్డి వరంగల్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి కాబోయే ప్రధాని కేసీఆరే అని, విజయదశమి రోజున వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తన భవిష్యత్తు కార్యాచరణ మొదలుపెడతారని, పూర్తిగా దేశ రాజకీయాలపైనే ఫోకస్ పెడతారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రధాని కావాలని భద్రకాళి అమ్మవారికి మొక్కినట్లు మంత్రి చెప్పారు. కేసీఆర్ దసరా ముహుర్తంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్లీనరీలో ప్రస్తావించినట్లు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి కేసీఆర్ జాతీయరాజకీయాల్లోకి వెళితే, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఆయన కొడుకు కేటీఆర్ ను నియమిస్తారా? దసరాలోపే నిర్ణయం తీసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, CM KCR, Kcr, KTR, Minister ktr, Telangana, Trs

ఉత్తమ కథలు