నేడు అమరావతిలో ఏపీ, తెలంగాణ సీఎస్‌ల భేటీ...

తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఏపీ పౌర సరఫరాల శాఖకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన క్యాష్ క్రెడిట్, పోలీసు ఉద్యోగుల ప్రమోషన్లు, ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీలు, తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి.

news18-telugu
Updated: January 16, 2020, 8:07 AM IST
నేడు అమరావతిలో ఏపీ, తెలంగాణ సీఎస్‌ల భేటీ...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఏపీ, తెలంగాణ సీఎస్‌లు గురువారం ఉదయం సమావేశంకానున్నారు. తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎస్‌ల భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ భేటీలో గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయం చర్చలు జరగనున్నాయి. అలాగే ముఖ్యంగా 9, 10 షెడ్యూల్‌లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఏపీ పౌర సరఫరాల శాఖకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన క్యాష్ క్రెడిట్, పోలీసు ఉద్యోగుల ప్రమోషన్లు, ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీలు, తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ భేటీ అనంతరం ఏపీ అధికారుల బృందం కూడా హైదరాబాద్‌లో తెలంగాణ అధికారులతో చర్చించనుంది.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>