Home /News /telangana /

ANDHRA MAN ESCAPED WITH HYDERABAD OWNER GIRL AND COMMIT SUICIDE IN GUNTUR HSN

ఏపీ యువకుడు.. హైదరాబాద్ లో పనిచేస్తూ యజమాని కుమార్తెతో ఎస్కేప్.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

’అదేంట్రా, నీకు ఇప్పటికే పెళ్లయింది కదా, రెండో పెళ్లి ఏంటి.? ఇంటికి రా, మాట్లాడుకుందాం‘ అని ఆ తండ్రి అన్నాడు. అంతే ఆ మాటలతో అతడికి క్లారిటీ వచ్చేసింది. తమ ఇద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని నిర్ణయానికి వచ్చేశాడు. ఆ తర్వాత..

    ఏపీకి చెందిన ఓ యువకుడు. హైదరాబాద్ కు జీవనోపాధి కోసం వచ్చాడు. ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే యజమాని కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటికే అతడికి పెళ్లయినా సరే ఆమెతో ప్రేమాయణం జరిపాడు. మాయమాటలు చెప్పి ఆమెను తీసుకుని హైదరాబాద్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. నేరుగా గుంటూరుకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేశాడు. ’నాన్నా, నేను మా యజమాని కూతురిని ప్రేమించాను. పెళ్లి చేసుకుందామనుకుంటున్నా‘ అని బాంబు పేల్చాడు. ’అదేంట్రా, నీకు ఇప్పటికే పెళ్లయింది కదా, రెండో పెళ్లి ఏంటి.? ఇంటికి రా, మాట్లాడుకుందాం‘ అని ఆ తండ్రి అన్నాడు. అంతే ఆ మాటలతో అతడికి క్లారిటీ వచ్చేసింది. తమ ఇద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని నిర్ణయానికి వచ్చేశాడు. ఓ కూల్ డ్రింక్ బాటిల్లో పురుగుల మందు కలుపుకుని ఇద్దరూ తాగారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం, ముప్పాలపాడు గ్రామానికి చెందిన వెండి దండి పృథ్వీ అనే 25 ఏళ్ల యువకుడు బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లాడు. అతడికి అప్పటికే పెళ్లయింది. అయితే హైదరాబాద్ లో ఓ దుకాణంలో పనిచేస్తూ, ఆ దుకాణ యజమాని కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెళ్లి చేసుకుందామని ఆ యువతికి చెప్పి, ఆమెతో సహా ఫిబ్రవరి 1వ తారీఖున అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. దుకాణంలో పనిచేసే కుర్రాడితో పాటు, తన కూతురు కూడా కనిపించకుండా పోవడాన్ని గమనించిన యజమాని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పృథ్వీ మంగళవారం తన తండ్రికి ఫోన్ చేసి యువతి గురించి చెప్పాడు. మరో పెళ్లి చేసుకుంటానన్నాడు. దీనికి ఆ తండ్రి అడ్డుచెప్పాడు. ఇంటికి వస్తే మాట్లాడుకుందామన్నాడు.

    దీంతో మనస్థాపం చెందిన పృథ్వీ, ఆ యువతితో సహా గుంటూరు జిల్లాలోని తాడేపల్లి గుహాలయాల సమీపంలో ఆత్మహత్యాయత్నం చేశారు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగారు. వారిద్దరు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పృథ్వీ చనిపోయాడని వైద్యులు తేల్చారు. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారి పర్సులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Crime story, Hyderabad, Lovers suicide

    తదుపరి వార్తలు