మట్టిపొరల కింద దాగి ఉన్న మహా చరిత్ర.. నిర్మల్ లో బయటపడ్డ ప్రాచీన శాసనాలు

నిర్మల్ లో బయటపడ్డ ప్రాచీన శాసనం

ఇది కళ్యాణి చాలుక్యుల నాటిదని భావిస్తున్నారు. ఈ శాసనం స్థానికంగా ఉన్న ఒక గుడికి ఇచ్చిన ఇనాంగా ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  చారిత్రక నేపథ్యం ఉన్న నిర్మల్ జిల్లా మట్టిపొరల కింద దాగి ఉన్న మహా చరిత్ర క్రమంగా వెలుగులోకి వస్తోంది. జిల్లాలో అక్కడక్కడ బయటపడుతున్న శతాబ్ద కాలాల నాటి శిలా శాసనాలు గతించిన చరిత్రకు అద్దంపడుతున్నాయి. గడిచిన రెండు నెలల్లోనే జిల్లాలోని పలుచోట్ల అరుదైన ప్రాచీన శాసనాలు బయటపడ్డాయి. తాజాగా నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్ బిడ్ గ్రామంలో 16, 17 శతాబ్దానికి చెందిన శాసనాన్ని గుర్తించారు అధికారులు. ఇది కళ్యాణి చాలుక్యుల నాటిదని భావిస్తున్నారు. ఈ శాసనం స్థానికంగా ఉన్న ఒక గుడికి ఇచ్చిన ఇనాంగా ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  గ్రామంలోని పురాతన కాలం నాటి మల్లన్న గుడి, హనుమాన్ మందిరం సమీపంలో రాతి స్థంబంపై ఆరు వరుసల్లో దేవనాగరి లిపిలో ఈ శాసనం లిఖించి ఉంది. ఈ శాసనం గ్రామానికి చెందిన నాగవాడి అనే అధికారి ఆలయానికి ఇచ్చిన ఇనాంను సూచిస్తుందని నిర్మల్ జిల్లాకు చెందిన కవి, పరిశోధకుడు తుమ్మల దేవ రావ్ పేర్కొన్నారు.  మైసూర్ కు చెందిన డైరెక్టర్ ఆఫ్ ఎపిగ్రఫీ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన మిత్రుడి ద్వారా శాసనంపై ఉన్న భాషను తెలుసుకోగలిగానని ఆయన తెలిపారు.  కాగా గత నెలలో నిర్మల్ జిల్లాలోనే దిలావర్ పూర్ మండల కేంద్రంలో వెయ్యెళ్ళనాటి కన్నడ శాసనాలు బయటపడ్డాయి. ఆ తర్వాత కొద్దీ రోజులకు లోకేశ్వరం మండలం బ్రహ్మేశ్వర దేవాలయానికి కొద్ది దూరంలో కళ్యాణి చాలుక్య రాజు వేయించిన అరుదైన ప్రాచీన కన్నడ శాసనం వెలుగు చూసింది. ఇలాంటి శాసనాలతో ఘనమైన చరిత్ర వెల్లడవుతుందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవ రావ్ అభిప్రాయపడ్డారు.
  Published by:Srinivas Munigala
  First published: