YS Sharmila: వైఎస్ షర్మిలను కలిసిన ప్రముఖ యాంకర్.. అప్పుడు జగన్ వెంట.. ఇప్పుడు షర్మిలతో..!

వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వేగంగా పావులు కదుపుతున్నారు.

  • Share this:
    తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల(YS Sharmila) వేగంగా పావులు కదుపుతున్నారు. ఏప్రిల్ 9న ఆమె పార్టీని ప్రకటించనున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆమె తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులతో సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. అలాగే విద్యార్థులతోనూ షర్మిల సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కొందరు నేతలు ఆమె పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే షర్మిలతో ప్రత్యేకంగా సమావేశంపై పలు అంశాలను చర్చిస్తున్నారు.ఇక, తాజాగా ప్రముఖ తెలుగు యాంకర్ శ్యామల షర్మిలను కలిశారు. శ్యామలతో పాటు ఆమె భర్త నటుడు నరసింహా కూడా ఉన్నాడు. భర్తతో కలిసి లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయానికి వెళ్లిన శ్యామల.. ఆమెతో భేటీ అయ్యారు. 10 నిమిషాలకు పైగా ఈ భేటీ సాగింది. షర్మిల పార్టీ పెడితే చేరేందుకు సిద్దంగా ఉన్నట్టుగా షర్మిలతో శ్యామల దంపతులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, శ్యామల ఇదివరకే షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించినట్టుగా సమాచారం.

    ఇక, ప్రస్తుతం యాంకర్ శ్యామల వైసీపీలో కొనసాగుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆమె తన భర్తతో వైసీపీలో చేరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీరిద్దరి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే ఇప్పుడు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టనున్న నేపథ్యంలో శ్యామల వైసీపీని గుడ్‌ బై చెప్పనున్నట్టుగా సమాచారం. ఇదే విధంగా తెలంగాణ వైసీపీకి చెందిన నేతలు కూడా షర్మిల పెట్టబోయే పార్టీ‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

    Anchor Shyamala Couple Meets YS Sharmila, Anchor Shyamala Meets YS Sharmila, Anchor Shyamala, Anchor Shyamala Husband, Anchor Shyamala News, Anchor Shyamala Photos, YS Sharmila, YS Sharmila New Party, YS Sharmila News, YS Sharmila New party Update, వైఎస్ షర్మిల, యాంకర్ శ్యామల
    వైఎస్ షర్మిలను కలిసిన యాంకర్ శ్యామల.. (Image-Twitter)


    Anchor Shyamala Couple Meets YS Sharmila, Anchor Shyamala Meets YS Sharmila, Anchor Shyamala, Anchor Shyamala Husband, Anchor Shyamala News, Anchor Shyamala Photos, YS Sharmila, YS Sharmila New Party, YS Sharmila News, YS Sharmila New party Update, వైఎస్ షర్మిల, యాంకర్ శ్యామల
    వైఎస్ షర్మిలను కలిసిన యాంకర్ శ్యామల.. (Image-Twitter)


    ఇక, వైఎస్ షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీకి రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నాయి. వైఎస్ఆర్ టీపీ, వైఎస్ఆర్ పీటీతో పాటు రాజన్న రాజ్యం అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ 9న పార్టీ ప్రకటించబోయే రోజే పార్టీ పేరు, పార్టీ గుర్తుతో పాటు పార్టీ విధి విధానాలు ఏంటనేది తెలియజేయనున్నారు. ఏపీలో జగన్ మీద కోపం వస్తే ఆమె ఆంధ్రాలో కొత్త పార్టీ పెట్టుకోవాలి కానీ, తెలంగాణలో పార్టీ పెడతామంటే ఎలా అంటూ తెలంగాణలోని పలు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: