ANAND MAHINDRA SAYS THANKS TO TELANGANA GOVT FOR E CAR RACING MOU VRY
Hyderabad : ఇంకా ఆగలేము.. ఈ కార్ రేసింగ్ పోటిలపై ఆనంద్ మహింద్రా, మంత్రికి Thanks అంటూ ట్వీట్
anand mahindra
Hyderabad : హైదరాబాద్ లో రేసింగ్ కాంపిటేషన్ పై ప్రముఖ వ్యాపార వేత్త మహింద్రా గ్రూప్ చైర్మణ్ ఆనంద్ మహింద్రా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్‌కు ఆయన ధన్యావాదాలు తెలిపారు. తాము ఇంకా వెయిట్ చేయలేమంటూ ఉత్సహాన్ని వ్యక్తపరిచారు.
హైదరాబాద్ నగరంలో ఈ కార్ రేసింగ్‌కు నేడు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే.. మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ టీమ్‌తో అవగాహాన ఒప్పందం చేసుకున్నారు. దీంతో రానున్న కొద్దిరోజుల్లో సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సెస్ సాగర్ చుట్టూ ఈ రేసింగ్ కోర్టు అందుబాటులోకి రానుంది. ఈ ఘనత సాధించిన ప్రపంచ స్థాయి మహానగరాలైన న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్ వంటి ఎలైట్ క్లబ్ లిస్టులో హైదరాబాద్ కూడా చేరింది. ఈమేరకు “ఫార్ములా ఈ” సంస్థకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికీ, గ్రీన్ కో అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగింది. అత్యంత పర్యావరణ హితమైన కార్లతో నిర్వహించే ఈ “ఫార్ములా ఈ” రేసింగ్ ను “ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్” అనే సంస్థ ప్రతి ఏడాది ఒక్కో నగరంలో నిర్వహిస్తుంది. కాగా ఇందులో మహింద్రా రేసింగ్ కంపనీ కూడా వ్యవస్థపాక భాగస్వామిగా కొనసాగుతోంది.
ఈ రేసింగ్ విదేశాల్లో కాకుండా ఈసారి భారత్‌లో నిర్వహించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మహింద్రా రేసింగ్ కంపనీ తన సొంత రేసింగ్ కార్లను స్వదేశంలో పరుగులు పెట్టించబోతున్నందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఝతలు తెలిపారు. ఈ రేసింగ్ ద్వారా తన చిరకాల స్వప్నం నెరవేరబోతుందంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్‌కు రీ ట్వీట్ చేశారు.
We were one of the founding teams in Formula E and a long held dream of @MahindraRacing has been to race our cars on home ground, cheered on by a home crowd. Thank you @KTRTRS for taking a huge step towards making that dream a reality! We can’t wait… https://t.co/HF9OoVDVXO
ఈ రేసింగ్ విదేశాల్లో కాకుండా ఈసారి భారత్‌లో నిర్వహించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మహింద్రా రేసింగ్ కంపనీ తన సొంత రేసింగ్ కార్లను స్వదేశంలో పరుగులు పెట్టించబోతున్నందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఝతలు తెలిపారు. ఈ రేసింగ్ ద్వారా తన చిరకాల స్వప్నం నెరవేరబోతుందంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్‌కు రీ ట్వీట్ చేశారు.
కాగా ఈ రేసింగ్ ఇప్పటి వరకు లండన్, న్యూయార్క్, రోమ్, బెర్లిన్, సియోల్ వంటి నగరాల్లో ఈ పోటిలు జరిగాయి. అయితే ప్రస్తుత సీజన్‌కు సంబంధించి సౌదీ అరేబియాలో కొనసాగనుండగా ఆ తర్వాత పదవ రేసింగ్ కు సంబంధించి హైదరాబాద్‌లో కొనసాగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.