AN OIL TANKER LORRY OVERTURNED AT MADHAPUR X ROAD IN SONE MANDAL ADB VB
Telangana News: 20 వేల లీటర్ల ఆయిల్ నేల పాలు.. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి..
ట్యాంకర్ నుంచి కారుతున్న ఆయిల్
Telangana News: సోన్ మండలంలోని మాదాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అదుపు తప్పి ఆయిల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. హైదరాబాద్ వైపు నుండి నాగ్‌పూర్ వెళ్తుండగా మాదాపూర్ ఎక్స్‌రోడ్ వద్ద లారీబోల్తా పడింది. ట్యాంకర్ లో ఉన్న ఆయిల్ మొత్తం వృథా పోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వైపు నుండి నిర్మల్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయింది. దీంతో అదుపు తప్పి ఆ వాహనం బోల్తా పడింది. ట్యాంకర్లో ఉన్న సుమారు 20 వేల లీటర్ల ఆయిల్ నేలపాలైంది. జాతీయ రహదారిపై ఆయిల్ కారుతూ ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సోన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్వల్ప గాయాలపాలైన ద్విచక్రవాహనదారుడిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం సంభవించకుండా ముందస్తుగా ఫైర్ ఇంజన్ ను రప్పించారు. భారీ క్రేన్లను తెప్పించి ట్యాంకర్ ను రోడ్డుపై నుండి తొలగించి రహదారిని క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే అక్కడ నుంచి ఆయిల్ మొత్తం పూర్తిగా ఆరే వరకు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అతి వేగంగా వాహనాలు నడిపితే మాత్రం ఆ ప్రదేశంలో ఆయిల్ ఉండటంతో కింద పడే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా దూదిగాం గ్రామానికి చెందిన సూదు నర్సయ్యకు స్వల్పగాయాల య్యాయి. శిక్షణ ఎస్సై జ్యోతిమణి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.