Home /News /telangana /

AN ENGLISH TEACHER SUCCESS STORY FROM KHAMMAM ON THIS INTERNATIONAL WOMENS DAY BA

WomensDay 2020 | ఈ టీచర్ ఓ లీడర్... పాఠాలే కాదు సందేశాలు ఇచ్చే నటి...

శిరీష, ఉపాధ్యాయురాలు

శిరీష, ఉపాధ్యాయురాలు

International Womens Day | టీచర్ అంటే కేవలం పిల్లలకు చదువు చెప్పడమే కాదు. నిత్యం బడికి వచ్చే వారిని, వారి నడవడిని పరిశీలిస్తూ.. వారిలో మంచి చెడులను విశ్లేషిస్తూ.. ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

    ఆమె ఓ మధ్య తరగతి యువతి. చదువు మధ్యలోనే పెళ్లయింది. అయినా నిరాశ చెందలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, భర్తఅత్తమామలను ఒప్పించి.. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా చదువు సాగించారు. చదువుకోవాలన్న కసితో ఆమె ఉన్నత విధ్యను అభ్యసించింది. ఖమ్మం జిల్లాలో ఓపెన్ కాంపిటిషన్లో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించారు. ఆమె శిరీష. ఖమ్మం జిల్లాలోని పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా ఇంగ్లీష్ భాషను బోధిస్తున్నారు. జీవితంలో తనకంటూ ఓ గౌరవప్రదమైన వృత్తిలో స్థిరపడ్డారు. అయినా ఇంకా చదవాలన్న కాంక్ష తీరలేదు. దాంతో ఉపాధ్యాయురాలిగానే పనిచేస్తూ కాకతీయ యూనివర్శిటీలో పీజీ చేశారు. ఆ తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్, బెంగళూరు, సీసీఆర్టీ గౌహతిలో సర్టిఫికెట్ ఆఫ్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ పూర్తిచేశారు. ఇలా తాను ఎంచుకున్న రంగంలో అవసరమైన మేర చదువుకుని, తోటి వారికన్నా ముందుండాలన్న కసితో కష్టించారు.

    టీచర్ అంటే కేవలం పిల్లలకు చదువు చెప్పడమే కాదు. నిత్యం బడికి వచ్చే వారిని, వారి నడవడిని పరిశీలిస్తూ.. వారిలో మంచి చెడులను విశ్లేషిస్తూ.. ఆత్మవిశ్వాసం నింపుతూ.. జీవితం అంటే ఏమిటి? ఓ మంచి మనిషిగా ఎదగడానికి అవసరమయ్యే అన్ని లక్షణాలను పిల్లలకు నేర్పిస్తూ ముందుకెళ్లడంలోనే సంతృప్తి ఉందంటున్నారు.


    ఇటు ఉద్యోగ జీవితంలో విద్యార్థులకు పాఠాలు చెబుతూనే ఉపాధ్యాయ యూనియన్లోనూ తన సేవలను అందిస్తున్నారు. పీఆర్టీయూ మహిళా శాఖ మండల కార్యదర్శిగా... ఇంగ్లీష్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా, జనజాగృతి సంస్థ మండల కన్వీనర్‌గానూ పనిచేస్తున్నారు. ఇంకా నటన పట్ల తన అభిరుచిని చాటుకుంటూ సామాజిక దురాచారాలపై చైతన్యం కలిగిస్తూ షార్ట్ ఫిల్మ్‌ల్లో నటిస్తున్నారు. దీంతోబాటు 2018 జిల్లాలోనే బెస్ట్‌గా స్వచ్ఛ పాఠశాల అవార్డును అందుకున్నారు. ఇలా ఓవైపు ఇంటిని చక్కదిద్దుకుంటూ.. ఉపాధ్యాయుడైన భర్త సహకారంతో పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంటూనే సమాజం పట్ల, వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకుంటున్నారు శిరీష.

    (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Khammam, Telangana, Womens Day 2020

    తదుపరి వార్తలు