హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad Story: అయ్యో ఈ వృద్ధ దంపతులకు ఎంత కష్టమొచ్చె.. పైసాపైసా కూడబెట్టి సూట్​కేసులో పెడితే..

Sad Story: అయ్యో ఈ వృద్ధ దంపతులకు ఎంత కష్టమొచ్చె.. పైసాపైసా కూడబెట్టి సూట్​కేసులో పెడితే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పేదవాడు ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బుకు చెదలు.. సూట్ కేసు లో దాచుకున్న లక్షన్నర రూపాయలు చెదలు పాలైన వైనం.. బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం.. న్యాయం చేయాలని వేడుకుంటున్న వృద్ధ దంపతులు..

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (G. Srinivas reddy, News18, Khammam)

  ఖమ్మం (Khammam) జిల్లాలో ఇరువురు వృద్ధ దంపతుల (elderly couple) బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇల్లందు మండలం సంజయ్ నగర్ లో గడ్డం లక్ష్మయ్య, లక్ష్మీ అనే వృద్ధ దంపతులు కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరే వారి ఇంట్లో ఉంటున్నారు. కూలి పనులకు వెళ్లి ఎంతో కష్టపడి వచ్చిన సొమ్మును పైసా , పైసా కూడబెట్టి చెక్క సెల్ఫ్ అర పై సూట్ కేసులో లక్షన్నర రూపాయలను దాచుకున్నారు. పాత రేకుల ఇల్లు కావడం , ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దూలాలకు చెదలు పట్టి, సూట్ కేస్ కు కూడా పాకింది. దంపతులు రెండు రోజుల క్రితం సూట్ కేసును తెరిచి చూడగా డబ్బులు మొత్తం చెదల పాలు అయ్యాయి.

  లక్ష్మయ్య ఆ చెదలు పట్టిన నోట్లను పట్టుకొని పట్టణంలో బ్యాంకుల చుట్టూ తిరిగాడు. బ్యాంకులో వారు, వారి పరిధిలో డబ్బు మార్పిడికి వీలుకాదని హైదరాబాద్ వెళ్లాలని బాధితుడికి సూచించారు. హైదరాబాద్ వెళ్లడానికి చార్జీలు కూడా లేవని, పైసా, పైసా కూడపెట్టిన పైసలు వృద్ధాప్యంలో పనికొస్తాయని అనుకుంటే, ఇలా చెదలు పాలు అయ్యాయని తమను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.

  చిరిగిన నోట్లు ఉన్నాయా?

  మీ వద్ద పాత లేదా చిరిగిన నోట్లు ఉన్నాయా… ఏ దుకాణదారుడు తీసుకోలేదా? ఇలాంటివి ఏదైనా ఉంటే, మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ నోట్లను సులభంగా మార్చవచ్చు. చిరిగిన మరియు పాత నోట్ల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మార్గదర్శకాన్ని కూడా జారీ చేసింది, దీని ప్రకారం వినియోగదారులు బ్యాంకుకు వెళ్లి అలాంటి నోట్లను మార్చవచ్చు. పాత నోట్లను ఎలా మార్చాలో తెలుసుకోండి..

  బ్యాంకుకు వెళ్లి నోటు మార్చండి

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)నిబంధనల ప్రకారం, ప్రతి బ్యాంకు పాత, చిరిగిన లేదా ముడుచుకున్న నోట్లు అన్ని బ్యాంకుల్లో చెల్లుతాయి. అందువల్ల, మీరు సులభంగా సమీప బ్యాంకు శాఖకు వెళ్లి నోట్లను మార్చవచ్చు. దీని కోసం ఎటువంటి రుసుము వసూలు చేయరు. అలాగే, ఆ ​​బ్యాంకు కస్టమర్ అవ్వాల్సిన అవసరం లేదు.

  మార్చడానికి ముందు బ్యాంక్ నోటు పరిస్థితిని తనిఖీ చేస్తుంది

  నోటు మారుతుందా లేదా అనేది బ్యాంకు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీని కోసం, ఏ వినియోగదారుడు బ్యాంకును బలవంతం చేయలేరు. బ్యాంక్ నోట్ తీసుకునేటప్పుడు, ఆ నోట్ ఉద్దేశపూర్వకంగా చిరిగిపోయిందో లేదో తనిఖీ చేస్తుంది. ఇది కాకుండా, నోట్ పరిస్థితి ఎలా ఉంది అని బేరీజు వేసుకొని, బ్యాంకు దాన్ని మారుస్తుంది. నోట్ నకిలీది కాకపోతే దాని పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటే, బ్యాంక్ దానిని సులభంగా మారుస్తుంది.

  ఏ నోట్లను మార్పిడి చేయలేము?

  ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం, చెడుగా కాలిపోయిన, చినిగిన ముక్కల విషయంలో నోట్లను మార్పిడి చేయలేము. ఇటువంటి నోట్లను ఆర్‌బిఐ ఇష్యూ కార్యాలయంలో మాత్రమే జమ చేయవచ్చు.

  బిల్లు లేదా పన్ను చెల్లించవచ్చు

  అయితే చినిగిన నోట్లతో మీ బిల్లులు లేదా పన్నులను బ్యాంకుల్లో చెల్లించవచ్చు. ఇది కాకుండా, అటువంటి నోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, Money

  ఉత్తమ కథలు