AN ANCIENT LAMP POST NEAR A TEMPLE IN THE CENTER OF BASARA MANDAL IN NIRMAL DISTRICT HAS BEEN VANDALIZED BY UNIDENTIFIED PERSONS ADB PRV
Basara: బాసరలో అపశృతి.. ఆలయంలోని పురాతన దీప స్తంభం ధ్వంసానికి యత్నం.. నిందితుడు అధికార పార్టీ నేత?
ద్వీప స్తంభం
చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి కొలువున్న నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని పురాతన దీప స్థంభాన్నిగుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి కొలువున్న నిర్మల్ (Nirmal) జిల్లా బాసర (Basara) మండల కేంద్రంలోని పురాతన దీప స్తంభాన్ని (ancient lighthouse) గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి భర్తే ప్రధాన సూత్రధారని తేలడంతో విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. దీంతో బాసరలోని పాపహరేశ్వర ఆలయం (Papahareshwara Temple) సమీపంలోని కోనేరు వద్ద ఉన్నఈ దీప స్తంభం 8వ శతాబ్దం నాటిదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ దీప స్థంభం పైకప్పును గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. అర్ధరాత్రి వేళ జేసీబీ (JCB) సహాయంతో దీప స్థంభాన్ని (ancient lighthouse) పెకిలించే ప్రయత్నం చేయడంతో ఆ ఏకశిల విగ్రహం పటిష్టంగా ఉండటంతో అది ఊడి రాలేదు. కాని ఆ స్థంభంపై ఉన్న కొన్ని శిలలు ఊడిపోయి కిందపడటంతో దుండగులు వాటిని అపహరించారు. స్థానిక సర్పంచ్ ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తును చేపట్టిన పోలీసులు బాసర మండలంలోని బిద్రెల్లీ లో ఒక పశువుల పాకలో స్థంభం శిలలను కనుగొన్నారు.
విలువైన వస్తువులు దొరుకుతాయనే..?
ఆ పాక యజమాని పోలీసులకు చెప్పిన విషయాల ఆధారంగా దీని వెనుక ఓ అధికార పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధి భర్త హస్తం ఉన్నట్లు నిర్ధారించారు. అయితే గుప్త నిధుల కోసమే దీప స్థంభాన్ని పెకిలించే ప్రయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు. సాధారణంగా ఇటువంటి ఘటనల వెనుక విలువైన వస్తువులు దొరుకుతాయి అనే భావన వారిని ప్రేరేపించి ఉండవచ్చు అని స్థానికులు భావిస్తున్నారు. కాగా అది కేవలం ఒక కీర్తి స్తంభము అని చరిత్రకారులు చెప్తున్నారు.
temple
ఏదైనా విశేషమైన శక్తి..
ఇటువంటి పురాతన వస్తువుల వద్ద ఏదైనా దొరుకుతుందనే ఆశ లేదా దానికి ఏదైనా విశేషమైన శక్తి ఉంటుంది అని తప్పుదోవ పట్టించే ప్రచారం ఈ దుండగులను ప్రభావితం చేసి ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. ఇటీవల బిద్రెల్లీ గ్రామంలో జరిగిన ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్న కొందరు పెద్దల బోధ వల్ల దుండగులు ప్రభావితం అయి ఇలాంటి దుస్సాహసానికి పాల్పడి ఉంటారని మరికొందరు అంటున్నారు.
స్తంభం
దీప స్థంభంకు సంబంధిమ్చిన అవశేషాలు లభించిన పశువుల పాక యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇదిలా ఉంటే ఈ దీప స్థంభం ధ్వంసం చేసిన ఘటనలో బిద్రెల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ (TRS) ఎంపీపీ భర్త విశ్వనాథ్ పటేల్ ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం విశ్వనాథ్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
మరోవైపు అధికార పార్టీ నాయకుడు ఈ ఘటనకు పాల్పడటంతో స్పందించిన ఆ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి విశ్వనాథ్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు బాధ్యులను గుర్తించినా చర్యలు తీసుకోవడంలో జరుగుతున్నజాప్యాన్ని నిరసిస్తూ విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా బాసర లాంటి చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం తో స్థానికులు అవమానంగా భావిస్తున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.