• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • AN ANALYSIS ON THE POLITICAL FUTURE OF ITALA RAJENDER IN TELANGANA VB

Etela Rajender: ఈటల దారెటు..! తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందా..?

Etela Rajender: ఈటల దారెటు..! తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందా..?

ఈటల రాజేందర్( ఫైల్ ఫోటో)

Etela Rajender: కొంతకాలం నుంచి సీఎం కేసీఆర్ కు ఈటల రాజేందర్ కు మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యలోనే భూకబ్జా ఆరోపణలపై సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే ఆయనను మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేయగా అతని రాజకీయ భవిష్యత్ ఎంటనేది రాజకీయవర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 • Share this:
  సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. రైతుల ఆరోపణలు, కలెక్టర్‌ నివేదికను పరిగణలోకి తీసుకుని ఈటలను సీఎం మంత్రివర్గం నుండి తొలగించారు. నేపథ్యంలో ఈటల రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రస్తుతం రజాకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారింది. నలుగురు ఒక చోటు కలిసి ఇప్పుడు ఈటల రాజకీయ భవిష్యత్ పైనే చర్చించుకుంటున్నారు. గత కొంత కాలంగా సీఎంకు, ఈటలకు మధ్య సత్సంబంధాలు లేవని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు వాటికి సూచికంగా కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావం దగ్గర నుంచి ఈటల పార్టీలో ముఖ్యమైన నేతగా, తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి మంత్రిగా కొనసాగిన ఈటలపై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో విచారణ ఆదేశించడం వెనువెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం అనేవి గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది.

  ఇటీవల ఈటల తన సొంత నియోజకవర్గంలో వివిధ సందర్భాల్లో రాజేందర్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పార్టీకి ఎవరూ ఓనర్లు కాదని ఒకసారి, వ్యవసాయ బిల్లుల గురించి ఇంకోసారి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ వ్యాఖ్యలే ఈటల కొంపముంచాయనే అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈటల ఆ విధంగా మాట్లాడటానికి గల కారణం ఏమయి ఉండొచ్చనే కారణాలను కూడా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా 2001 నుంచి టీఆర్ ఎస్ వెన్నంటే ఉన్న ఈటల కు ఈ ఆరోపణలు తన రాజకీయ జీవితంపై మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందిన ఈటల 2004లో కరీంనగర్‌ జిల్లాలోని కమలాపూర్‌ నియోజకర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో హుజూరాబాద్‌ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి వరుసగా గెలుపొందారు. మొదటి నుంచీ కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ఆయనకు 2014లో తెలంగాణ ఆవిర్భవించి తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకమైన ఆర్థిక మంత్రిత్వశాఖ లభించింది. మొదట రెండు మూడు సంవత్సరాల వరకు బాగానే ఉన్నా సీఎం కేసీఆర్ కు ఈటలకు మధ్య దూరం బాగా పెరిగినట్లు అప్పట్లో ప్రచారం బాగా జరిగింది.

  2018లో శాసనసభ ఎన్నికల్లో రెండోసారి టీఆర్ ఎస్ గెలిచిన తర్వాత మొదట మహమూద్‌అలీ ఒక్కరే కేసీఆర్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో మంత్రి వర్గంలో ఎవరు ఉంటారనే దానిపై బాగానే చర్చ జరిగింది. ఒకనానొక సందర్బంలో ఈటలకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలుకుతారేమోనని అనుకున్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఈటల స్థానంపై ఊగిసలాట జరిగి ఆఖరి నిమిషంలో మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇంత జరిగినా ఈటలకు రెండో సారి మంత్రి వర్గంలో స్థానం లభించింది. ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటివరకు ఉన్న విభేదాలు అన్నీ తొలగిపోయాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ అవే క్రమంగా విభేదాలు ఎక్కువయ్యాయనే అభిప్రాయం ఉంది. కొన్ని నెలలనుంచి ఈటల తనలోని అసంతృప్తిని బహిర్గతం చేస్తూ వివిధ సభలు, సమావేశాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని పలువురు మంత్రులు, నేతలు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అధికార పార్టీలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటనేది చాలా మందికి అర్థం కాలేదు. కానీ అప్పట్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు హుజూరాబాద్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

  అయితే వీటి గురించి మాట్లాడేందుకు కేటీఆర్ ఈటలను ప్రగతి భవన్ కు రమ్మని ఆ వ్యాఖ్యల గురించి అడిగినట్లు తెలుస్తోంది. ఎందుకు అలా మాట్లాడవని అడగడంతో తను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈటల సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే తర్వాత కూడా అతడిలో మార్పు రాకపోవడంతో ఈటల కార్యక్రమాలు, ఆయన చేసే వ్యాఖ్యలపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోందని పార్టీలో కొంతమంది నాయకుల ద్వారా తెలిసినట్లు సమాచారం. అయితే ఇటీవల జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్​లో పెట్టిన మీటింగ్​లో సీఎం.. ఈటలను ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్యలతో అప్పటి నుంచే ఈటలకు పార్టీ లీడర్లు దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈటలమీద ఆరోపణలపై సీఎం కేసీఆర్​ స్వయంగా విచారణకు ఆదేశించడంతో ఆయనతో మాట్లాడేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈటలకు మద్దతుగా ఉన్న కొందరు బీసీ సంఘాల నేతలకూ ప్రగతి భవన్​ నుంచి ఫోన్లు వెళ్లాయని, మద్దతును ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరించారని చెబుతున్నారు. కానీ బీసీ సంఘాల నాయకుల మద్దతుతో తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
  Published by:Veera Babu
  First published:

  అగ్ర కథనాలు