Home /News /telangana /

AN AGITATION LED BY MINISTER SRINIVAS GOWDA TOOK PLACE IN MAHABUBNAGAR DISTRICT TO PROTEST AGAINST THE ATTITUDE OF THE CENTRAL GOVERNMENT MBNR PRV

Telangana: కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే.. రేపు కేసీఆర్​ ఛలో ఢిల్లీకైనా పిలుపునిస్తారు.. సిద్ధంగా ఉండండి.. టీఆర్​ఎస్​ కార్యకర్తలకు మంత్రి పిలుపు

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న మంత్రి

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న మంత్రి

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణలో నిరసనలు తెలపాలని సీఎం కేసీఆర్​ పిలుపు మేరకు మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్  నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు

    (న్యూస్ 18, మహబూబ్ నగర్.. సయ్యద్ రఫీ)

    కేంద్ర ప్రభుత్వ (Central Government) వైఖరిపై తెలంగాణలో నిరసనలు తెలపాలని సీఎం కేసీఆర్​ పిలుపు మేరకు మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud)  నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్​ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ (Telangana) రాష్ట్రం లో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ  మహబూబ్​నగర్​ (Mahbubnagar)జిల్లా కేంద్రం లోని  తెలంగాణ చౌరస్తాలో వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు మంత్రి.

    ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా..

    అనంతరం మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్  TRS పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతలతో  అవగాహన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, TRS పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు  పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం తెలంగాణ (Telangana) రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న వివక్షతకు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల ను తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన ధాన్యం, ఇతర పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని అన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లు కు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

    ఛలో ఢిల్లీ కార్యక్రమానికి  పిలుపునిస్తే..

    కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, పార్టీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల వారిగా, మండలాల వారిగా, Pacs కమిటీలు, రైతు బంధు కమిటీ లు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం కు, ప్రధాన మంత్రి కార్యాలయం కు పంపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్  పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇలాగే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే  సీఎం కేసీఆర్ గారు భవిష్యత్ కార్యాచరణ కు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి  పిలుపునిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లా నుండి లక్షలాది మంది TRS కార్యకర్తలు, నాయకులు పాల్గొనేందుకు సిద్ధం గా ఉండాలని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

    ఈ కార్యక్రమంలో ZP చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ KC నర్సింలు, DCCB వైస్ ఛైర్మన్ వెంకటయ్య, జిల్లా గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, కౌన్సిలర్లు,TRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదీప్ రెడ్డి, ZPTC లు, MPP లు, సర్పంచ్ లు, MPTC లు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Mahbubnagar, Srinivas goud, Telangana, Trs

    తదుపరి వార్తలు